టీఆర్ఎస్ (TRS)పై మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డికె అరుణ (DK Aruna) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు హుజురాబాద్(Huzurabad)లో టీఆర్ఎస్ అసత్య ప్రచారాలపై ఆమె చార్జీ షీట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ (Telangana) వచ్చినప్పటి నుండి అందరిని మోసగింవడమే కేసీఆర్ పని అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు అకాంక్షల మేరకి కాకుండా అవినీతి అహంకారం తో పరిపాలన కొనసాగిస్తున్నడని విమర్శించారు. ఏ త్యాగాల కోసం తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బంధి అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు కెసిఆర్ పక్కన ఉన్నారని నాటి ఉద్యమ కారులను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.
బూతులు తిట్టినవారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు..
ఏ త్యాగాల కోసం తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణ కెసిఆర్ కుటుంబం చేతిలో బంధి అయ్యింది. కేసీఆర్ (KCR)ను బండ బూతులు తిట్టినవారే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారు. త్యాగాల కుర్చీల మీద గద్దెనెక్కిన కేసీఆర్ మనకి అవసరమా అంటూ ఆమె ప్రశ్నించారు. ఏడేండ్ల నుంచి గుర్తుకురాని దళితులు ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు.
Telangana Agriculture : దేశంలో మినపప్పు కొరత ఉంది.. పండించండి కొంటాం: మంత్రి నిరంజన్‌రెడ్డి
నాడు దళితులకి మూడేకరాల భూమి ఇస్తే ఇప్పుడు ప్రతి దళితుల దగ్గర ముఫ్ఫై లక్షల విలువగల భూమి ఉండేదని గుర్తిచేశారు. మహిళలకి బతుకమ్మ చీరేలు తప్పా మహిళ సాధికారత కోసం ఏం చెసారో చెప్పాలని ప్రశ్నించారు.
రాజేందర్ సేవలు మరువలేనివేవి..
నమస్తే తెలంగాణ పత్రిక ఎక్కడినుండి పుట్టింది..నమస్తే తెలంగాణ కోసం తన భూములని కుదవబెట్టిన ఈటెల రాజేందర్ ఇప్పుడు ద్రోహి ఎలా అయ్యాడు. నీ తొటి నడిచి,నీ అవసరాలు తిర్చున ఈటెల రాజేందర్ ఇప్పుడు తెలంగాణ ద్రోహి ఎలా అయ్యాడా అని ప్రశ్నించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కేసీఆర్‌కు మింగుడు పడక ఈటెల రాజేందర్ ని ద్రోహిగా చిత్రీకరించారన్నారు. కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు మరువలేని వని అన్నారు. ఆయన చాలా కష్టపడ్డారన్నారు.
ఎంతమందికిచ్చారు దళితులు..
దళితబంధు హుజూరాబాద్‌లో లాంచ్ చేసి ప్రతి దళిత కుటుంబంనకి ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలే కేసీఆర్‌కి హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఎస్సీ లకి నలభై వేల బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చెయ్యలేదో కెసిఆర్ జవాబు చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ప్రైవేట్ ఉద్యోగాలు మేమే ఇచ్చాం అని అంటున్న కేటీఆర్‌కి బుద్ధి ఉండాలని ఆమె అన్నారు. రూ.3,016 నిరుద్యోగ భృతి తెలంగాణలో ఏ ఒకరికన్నా వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. కేజీటూపీజీ ఎక్కడైనా అమలవుతుందా అని ప్రశ్నించారు.
- పి.శ్రీనివాస్, కరీంనగర్, న్యూస్18 తెలుగు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DK Aruna, Huzurabad, Huzurabad By-election 2021, Telangana