Home /News /telangana /

HUZURABAD BY ELECTION 2021 ETELA RAJENDER WIFE ETELA JAMUNA NOMINATION WITHDRAWAL IN HUZURABAD BYPOLL EVK

Huzurabad By-election 2021 : ఈటల జమున నామినేషన్‌ విత్‌ డ్రా.. బ‌రిలో 30మంది

ఈటల జమున (ఫైల్ ఫోటో)

ఈటల జమున (ఫైల్ ఫోటో)

Huzurabad By-election 2021 : హుజురాబాద్ ఉప ఎన్నికలో ఇటీవల నామినేషన్ పలువురు నాయుకులు విత్ డ్రా చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ అభ్య‌ర్థి, మాజీ మంత్రి ఈటల రాజేంద్రర్‌ సతీమణి ఈటల జమున త‌న నామినేష‌న్‌ను విత్‌డ్రా చేసుకొన్నారు.

    0హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad By-election) లో ఇటీవల నామినేషన్ పలువురు నాయుకులు విత్ డ్రా చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ (BJP) అభ్య‌ర్థి, మాజీ మంత్రి ఈటల రాజేంద్రర్‌ సతీమణి ఈటల జమున త‌న నామినేష‌న్‌ను విత్‌డ్రా చేసుకొన్నారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌తో వ్యూహాత్మ‌కంగా జ‌మున‌తో నామినేష‌న్ వేయించ‌న‌ట్టు అర్థం అవుతోంది. ఈమెతోపాటు కాంగ్రెస్ పార్టీ (Congress party) రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్ కుమార్ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. మొత్తం ఇప్పటి వరకూ 42మంది బరిలో ఉండగా ముగ్గురు విత్ డ్రా చేసుకున్నారు. మ‌రో 12మంది విత్‌డ్రా చేసుకొన్నారు. దీంతో  బరిలో 30మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

    అభ్యర్థుల ఆధారంగా ఈవీఎంల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ఈవీఎం (EVM)లో 15మంది అభ్యర్థులు, 1నోటా కలిపి 16మందికి అవకాశం ఉండనుంది.పోటీలో ఉన్న అభ్య‌ర్థులు,  ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు, నెంబర్లతో అక్షరక్రమంలో సింబల్స్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Micro Finance Companies : "మైక్రో" న‌ర‌కం.. అప్పు తీసుకొన్న వారిని వేధిస్తున్న‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు


    నామినేష‌న్ వేసింది 61మంది..
    హుజూరాబాద్ ఉప ఎన్నికల నేప‌థ్యంలో మొద‌ట మొత్తం 61మంది పోటి చేసేందుకు నామినేషన్లు వేశారు. నామినేషన్‌లు వేసిన వారిలో గెల్లు శ్రీని వాస్ యాదవ్ ( టీఆర్ఎస్ ) ,ఈటల జమున ( బీజేపీ ),ఈటల రాజేందర్ ( బీజేపీ ), బల్మూరి వెంకట్ ( కాంగ్రెస్ ) ,లింగారెడ్డి కాంగ్రెస్ ),మహ్మద్ మన్సూర్అలీ( అన్న వైఎస్సార్ కాంగ్రెస్ ),సిలివేరి శ్రీకాంత్ ( ప్రజా ఏక్తా పార్టీ ),కెశెట్టి విజయకుమార్ ( యువతరం పార్టీ ),లింగిడి వెంకటేశ్వర్లు (ప్రజావాణి పార్టీ ),కుంద్మిరి తాహేర్ కమల్(ఏఐఎంఐఎం),కె రాజేశ్వరీర్(ఇండియన్ ప్రజా కాంగ్రెస్),ఆర్ దిలీప్ కుమార్ (ఏఎన్సీ),కన్నం సురేష్ కుమార్ ( జైస్వరాజ్ పార్టీ ),ఉప్పు రవీందర్(జైమహా భారత్ పార్టీ),మంగు రామచంద్ర (ఇండియా ప్రజాబంద్ పార్టీ), ఎస్ సుమన్ (మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ) కర్ర రాజిరెడ్డి (ఎంసీపీఐ),ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్ ఇండి యా బీసీ , ఓబీసీ పార్టీ),ఇసాంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా),ఇండిపెండెంట్లుగా సైదులు, చంద్రశేఖర్, బుచ్చిరెడ్డి, నూర్జహాన్ బేగం, రమేష్,రాజు , విశ్వం, ప్రవీణ్,శ్రీనివాస్, రవీందర్,సాయన్న,రమేష్ బాబు,మాధవరెడ్డి, యుగేందర్,రత్నయ్య , వెంకటేశ్వర్లు, సంపత్, శ్రీనివాస్ రెడ్డి, సునీల్,వినోద్ కుమార్, వెంకన్న, తిరుపతి, కిరణ్, రవీందర్, జోగియరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఆనంద్,శ్యామ్ కుమార్,గుతు తిరుపతి నాయక్,రవి,ప్రశాంత్, దేవరాజ్,మల్లి ఖార్జున్,రాజ్ కుమార్,విక్రమ్ శెట్టి,స్వామి , మన్యం,అంజ య్య,కుమార్,లక్ష్మి,ఎల్లయ్య నామినేషన్లు దాఖలు చేశారు.

    రాజేందర్‌ పేరుతో మొత్తం నలుగురు అభ్యర్థులు..
    ఐతే నామినేషన్లలో ఓ ఆసక్తిర విషయం బయటకు వచ్చింది. హుజురాబాద్ ఉపఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో రాజేందర్‌ పేరుతో మొత్తం నలుగురు అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ (Eetala Rajender) పోటీ చేస్తున్నారు. ఆఖరి రోజున రాజేందర్‌ పేరుతో ఉన్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వారి ఇంటిపేర్లు కూడా అచ్చం ఈటల మాదిరిగానే ఉన్నాయి. 'ఈ' అనే అక్షరంతో ఇంటి పేర్లు ప్రారంభమవుతాయి. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఇమ్మడి రాజేందర్‌, న్యూ ఇండియా పార్టీ తరపున ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ తరపున ఇప్పలపల్లి రాజేందర్ మినేషన్లు సమర్పించారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Congress ts, Elections, Etela rajender, Huzurabad By-election 2021, Telangana, Telangana bjp

    తదుపరి వార్తలు