Huzurabad By-election 2021 : హుజూరాబాద్‌లో పండ‌గ వేళ‌ ఎన్నిక‌ల "కిక్కు".. జోరుగా మ‌ద్యం అమ్మ‌కాలు.. గ‌తేడాది క‌న్నా 50శాతం ఎక్కువ‌

ప్రతీకాత్మకచిత్రం

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ (Huzurabad By-election)ల్లో అన్ని పార్టీ నేత‌లు జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు. నిరంతం ప్ర‌చారం చేయాల్సి రావ‌డంతో జ‌నం త‌మ‌వెంట ఉండేలా తాయిలాలు ఇస్తున్నారు. ముఖ్యంగా మద్యం ప్రియుల‌కు పండగే.. ప్ర‌తీ పాలు అన‌ధికారికంగా జోరుగా మ‌ద్యం పంచుతున్నారు. గ‌తేడాదితో పోలిస్తే 50శాతం ఎక్కువ విక్ర‌యాలు జ‌రిగాయ‌ని అధికారులు చెబుతున్నారు.

 • Share this:
  హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ (Huzurabad By-election)ల్లో అన్ని పార్టీ నేత‌లు జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు. నిరంతం ప్ర‌చారం చేయాల్సి రావ‌డంతో జ‌నం త‌మ‌వెంట ఉండేలా తాయిలాలు ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ్రామాల్లో మద్యం ఇప్పటికే ఏరులై పారుతోందని , ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలే గ్లాసుల్లో మద్యం పోసి అందిస్తున్నారని సమాచారం దసరా రావడం తో హుజురాబాద్  ప్రజలకు దసరా దీపావళి ఆఫర్లు భారీగానే వస్తున్నాయని సమాచారం ఉంది. దీంతో పండ‌గ‌వేళ హుజూరాబాద్‌ వాసుల‌కు ఎన్నిక‌ల కిక్ ఫుల్‌గా ఉంద‌ని స్థానికులు మాట్లాడుకుటున్నారు. రాత్రిపూట మందు పార్టీలకు కొందరు హాజరవుతున్నారు. కొందరికి నేరుగా గదులకే మద్యం బాటిళ్లు సరఫరా అవుతున్నాయి. పండ‌గ స‌మ‌యం కావ‌డంతో ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు నేత‌లు స‌న్న‌ద్ధం అవుతున్నారు.

  గ‌తేడాదిక‌న్నా అధికంగా..
  ఈ అక్టోబరు 1 నుంచి 13 వరకు రూ.46.49 కోట్ల విలువైన మద్యాన్ని నియోజకవర్గంలో విక్రయించారని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. గ‌తేదితో పోలిస్తే ఇది చాలా ఎక్కు గ‌తేడాది అక్టోబ‌ర్ 2020లో మొత్తం 37.53 కోట్ల మ‌ద్యం అమ్మితే ఇప్ప‌టికే 46.49 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జర‌గ‌డం విశేషం. ప్ర‌స్తుతం వేడెక్కిన ఎన్నికల ప్ర‌చారం ఆధారంగా మ‌ద్యం అమ్మ‌కాలు గతేడాదితో పోలిస్తే 50శాతం ఎక్కువ‌గా అమ్ముడ‌వుతున్నాయని అధికారిక గ‌ణాంకాలు చెబుతున్నాయి.

  Micro Finance Companies : "మైక్రో" న‌ర‌కం.. అప్పు తీసుకొన్న వారిని వేధిస్తున్న‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు


  ఓట‌ర్ల‌కు ద‌స‌రా కానుక‌లు..
  ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇంటింటికీ దస‌రా(Dussehra) కానుక‌లు వ‌చ్చేలా రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్ట‌డానికి మ‌ద్యం ఒక వార‌ధిగా వాడుకొంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా హుజూరాబాద్, ప‌రిస‌ర ప్రాంతాల‌కు రాజ‌కీయ నాయ‌కుల తాకిడి పెర‌గ‌డంతో హోటళ్లు, లాడ్జి గదులన్నీ హౌస్‌ఫుల్‌ బోర్డులు పెట్టాయి. కరోనా (Corona) దెబ్బకు అన్ని పట్టణాల్లో టు లెట్‌ బోర్డులు దర్శనమిస్తుంటే.. బయటి నుంచి వచ్చిన వారితో హుజూరాబాద్‌లోని అద్దె ఇళ్లు, హోటళ్లు కిటకిటలాడిపోతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రక్రియల సమయంలోనే విజయదశమి పర్వదినం కూడా వస్తుండడంతో తామ ప్రచారాన్ని కూడా విజయం వైపు సాగించాలనుకుంటున్నాయట కొన్ని పార్టీలు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే విందు వినోదాలు చేసుకోవాలని కొంతమంది నాయకులు నజరానా ప్రకటించే పనిలో నిమగ్నం అయ్యారని తెలుస్తోంది .

  Telangana : బిల్డ‌ర్‌పై జీఎస్టీ అధికారి వేధింపులు.. రూ.10 లక్షలు డిమాండ్‌.. కేంద్ర మంత్రికి ఫిర్యాదు


  ముగిసిన నామినేష‌న్ ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ..
  హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad By-election) లో ఇటీవల నామినేషన్ పలువురు నాయుకులు విత్ డ్రా చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ (BJP) అభ్య‌ర్థి, మాజీ మంత్రి ఈటల రాజేంద్రర్‌ సతీమణి ఈటల జమున త‌న నామినేష‌న్‌ను విత్‌డ్రా చేసుకొన్నారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌తో వ్యూహాత్మ‌కంగా జ‌మున‌తో నామినేష‌న్ వేయించ‌న‌ట్టు అర్థం అవుతోంది. ఈమెతోపాటు కాంగ్రెస్ పార్టీ (Congress party) రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్ కుమార్ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. మొత్తం ఇప్పటి వరకూ 42మంది బరిలో ఉండగా ముగ్గురు విత్ డ్రా చేసుకున్నారు. ఉసంహ‌ర‌ణ ప్ర‌క్రియ ముగిసింది. చివ‌ర‌గా ఎన్నిక‌లబరిలో 30మంది అభ్యర్థులు ఉన్నారు.
  Published by:Sharath Chandra
  First published: