Home /News /telangana /

HUZRUABAD THE MAJOR PARTIES ARE SHOWING CONFIDENCE THEY GOING TO WIN THE ELECTION EVK

Huzurabad : ఎవ‌రి ధీమా వారిది.. గెలుపు మాదంటే మాదంటున్న పార్టీలు

ఈటల రాజేందర్‌, గెల్లు శ్రీనివాస్, బల్మూరి వెంకట్ (ఫైల్ ఫోటోలు)

ఈటల రాజేందర్‌, గెల్లు శ్రీనివాస్, బల్మూరి వెంకట్ (ఫైల్ ఫోటోలు)

Huzurabad : రాష్ట్రంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారిన హుజురాబాద్ ఎన్నిక‌ల ఘ‌ట్టం ముగిసింది. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు స‌ర్వేలు వెల్ల‌డించాయి. ఓట‌రు నాడి ఎటువైపుం ఉందో ఆయా సంస్థ‌లు అంచ‌నాలు వేస్తున్నా.. ప్ర‌ధాన పార్టీలు మాత్రం మాదే గెలుపంటు పేర్కొంటున్నాయి.

ఇంకా చదవండి ...
    రాష్ట్రంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారిన హుజురాబాద్ ఎన్నిక‌ల ఘ‌ట్టం ముగిసింది. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు స‌ర్వేలు వెల్ల‌డించాయి. ఓట‌రు నాడి ఎటువైపుం ఉందో ఆయా సంస్థ‌లు అంచ‌నాలు వేస్తున్నా.. ప్ర‌ధాన పార్టీలు మాత్రం మాదే గెలుపంటు పేర్కొంటున్నాయి. ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత ఆయా పార్టీల ప్ర‌ధాన ప్ర‌చార సార‌ధులు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గెలుపు త‌మ‌దేనంటు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల అనంత‌రం ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గొప్ప విజయం సాధించబోతోందని ఆయ‌న ధీమా వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా పార్టీ విజయం కోసం కష్టపడిన ఓటర్లందరికీ హరీశ్‌రావు ఈ సంద‌ర్భంగా ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్‌ ఓటర్లు చైతన్యా న్ని ప్రదర్శించారని ఆయ‌న కొనియాడారు. ప్ర‌జ‌లంతా కొవిడ్‌ నిబం ధనలు పాటిస్తూ పోలిం గ్‌కేం ద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగిం చుకోవడం వారి చైతన్యా నికి నిదర్శనమన్నారు. ఓటు హక్కు వినియోగిం చుకున్న ఓటర్లకు హరీశ్‌రావు ధన్య వాదాలు తెలిపారు.

    కేసీఆర్‌ మార్గదర్శకత్వం హుజూరాబాద్‌ ప్రజల ఆశీర్వా దం తో ఘన విజయం సాధిం చబోతున్నా మన్నారు. ప్ర‌జ‌లు ఓటు వినియోగించుకొనేందుకు క‌ష్ట‌ప‌డి కృషి చేసిన పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు.

    Huzurabad exit poll results : ఈటలదే గెలుపు -టీఆర్ఎస్‌పై 3శాతం మార్జిన్ -కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు


    ప్ర‌లోభాల‌కు గురి చేసినా.. మాదే గెలుపు..
    ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పార్టీ విజయం కోసం కృషి చేసిన భాజపా శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా.. ఓట‌ర్ల‌ను ప్రలోభాలకు గురి చేసినా జ‌నం నిష్పక్షపాతంగా ఓటు వేశార‌ని అన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డింద‌ని ఆయ‌న ఆరోపించారు. కేసీఆర్‌ అహం కారానికి, హుజూరాబాద్‌ ప్రజల ఆత్మ గౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు మం చి ఆలోచనతో భాజపాను ఆదరిం చారని పేర్కొ న్నా రు. హుజూరాబాద్‌ ఉపఎన్ని క ఓటిం గ్‌లో పాల్గొన్న ఓటర్లకు ధన్య వాదాలు తెలిపారు.

    హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు చరిత్రను తిరగరాశారని భావిస్తున్నా..
    ఎన్నిక‌ల అనంత‌రం బీజేపీ అభ్య‌ర్థి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్ర‌లోభాల‌ను దాటుకొని త‌న‌ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన ఓట‌ర్ల‌కు ఈట‌ల రాజేంద‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఉప ఎన్ని క కోసం తెరాస రూ.400 నుం చి 500 కోట్లు ఖర్చు పెట్టింద‌ని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఆధిపత్యాన్ని సహించే గడ్డ కాద‌ని అన్నారు. ప్రచారం లో పాల్గొన్న బం డి సంజయ్‌, అర్వింద్‌, విజయశాంతి, డీకే అరుణ, కేం ద్రమం త్రులు, జాతీయ నేతలకు కృతజ్ఞతలు. కష్టపడి పనిచేసిన నేతలు, కార్య కర్తలకు ఈటల రాజేందర్‌ తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Bjp, Congress, Huzurabad, Huzurabad By-election 2021, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు