• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HUSBAND TAKES HIS LIFE WITH UNBEARABLE HARASSMENTS BY WIFE AND HER BOYFRIEND IN JAGTIAL HSN

ప్రియుడితోనే నేను గర్భవతిని అయ్యా.. నీ బతుకెందుకు.. చచ్చిపో.. అంటూ భర్తకు ఫోన్లో చెప్పిన భార్య.. చివరకు..

ప్రియుడితోనే నేను గర్భవతిని అయ్యా.. నీ బతుకెందుకు.. చచ్చిపో.. అంటూ భర్తకు ఫోన్లో చెప్పిన భార్య.. చివరకు..

భర్త రాజు (ఫైల్ ఫొటో)

ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. కానీ వేరొకరిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన నాటి నుంచే గతంలో తాను ప్రేమించిన యువకుడి గురించి భర్తతో చెప్పేది. ప్రతీ విషయంలోనూ అతడితో పోల్చుతూ అవమానించేది. చివరకు..

  • Share this:
    ఎవరు ఎన్ని మాటలు అన్నా, తిట్టినా, అవమానించినా మగాళ్లు తట్టుకోగలరు. కానీ కట్టుకున్న భార్య నుంచే వేధింపులు మొదలైతే మాత్రం భర్త భరించలేడు. ప్రియుడి మోజులో పడి సూటి పోటు మాటలంటూ అవమానిస్తే తట్టుకోలేడు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. కానీ వేరొకరిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన నాటి నుంచే గతంలో తాను ప్రేమించిన యువకుడి గురించి భర్తతో చెప్పేది. ప్రతీ విషయంలోనూ అతడితో పోల్చుతూ అవమానించేది. చివరకు ప్రియుడి వల్లే తాను గర్భవతిని అయ్యానంటూ భర్తకే నేరుగా చెప్పేసింది. నీ బతుకెందుకు చావరాదూ అంటూ అవమానించింది. దీంతో భార్య వేధింపులు తట్టుకోలేక, ఆమె చేస్తున్న అవమానాలను భరించలేక ఆ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    జగిత్యాల జిల్లా మల్యాలకుచెందిన అట్టపెల్లి రాజు అనే 30 ఏళ్ల యువకుడికి గొల్లపెల్లి మండలం బొంకూరుకు చెందిన ఓ యువతితో ఏడాది క్రితం పెళ్లయింది. అయితే పెళ్లికి ముందే ఆ యువతి గొల్లపెల్లి మండలంలోని తుంగూరుకు చెందిన సప్ప రాజేందర్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఏ కారణం వల్లనో ఏమో కానీ రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయం రాజుకు తెలిసి తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ భార్య తీరులో మార్పులేదు. అంతేకాకుండా ప్రతీ విషయంలోనూ భర్తను, ప్రియుడిని పోల్చుతూ కామెంట్స్ చేసేది. అవమానించేది. ఇదే క్రమంలో ఆమె ఇటీవల గర్భం దాల్చింది.
    ఇది కూడా చదవండి: నాకు పిల్లను వెతికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో.. అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన 26 ఏళ్ల కుర్రాడు

    ‘ ఈ గర్భం వచ్చింది నీ వల్ల కాదు. దీనికి కారణం నువ్వు కాదు. నా ప్రియుడి వల్లే నేను గర్భవతిని అయ్యా‘ అంటూ భర్త రాజుతో తేల్చిచెప్పింది. ఆ తర్వాత తల్లిగారింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. అంతటితో ఆగకుండా ఆ భార్య వేధింపులను మరింత పెంచింది. ఆమె తన ప్రియుడితో కలిసి రాజును మానసికంగా చిత్రహింసలకు గురిచేసింది. ’నీ బతుకు ఎందుకు. ఎందులోనైనా దూకి చచ్చిపోరాదు. నీదీ ఒక బతుకేనా?’ అంటూ ఫోన్లు చేసి వేధించసాగారు. దీంతో మనో వేధనకు గురైన ఆ భర్త మంగళవారం మల్యాల మండలం నూకపెల్లి శివారులోని వరద కాలువ క్రాస్ రెగ్యులేటర్ గేట్ల వద్ద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య, ఆమె ప్రియుడి గురించి వివరాలు ఆరా తీస్తున్నారు.
    ఇది కూడా చదవండి: పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. అసలు కారణం ఏంటని నేరుగా అతడికే వధువు ఫోన్ చేస్తే..
    Published by:Hasaan Kandula
    First published: