Nalgonda : పిల్లలను పక్కరూంలో పడుకోవాలని చెప్పిన తండ్రి.. అర్థరాత్రి పూట దారుణానికి దిగాడు...?

Nalgonda : పిల్లలను పక్కరూంలో పడుకోవాలని చెప్పిన తండ్రి..

Nalgonda : అర్థరాత్రిపూట భార్యను కొట్టి,ఇద్దరు పిల్లలు ఉండగానే..వారికి తెలియకుండా. ఇంట్లోని ప్లాస్టిక్‌ తాడుతో ఉరిపెట్టి చంపాడు.. ఆ తర్వాత పిల్లలకు తెలియకుండానే భార్య శవాన్ని తన సొంత ఊరికి ఆటోలో తీసుకువెళ్లాడు..

  • Share this:
    పెళ్లై పది సంవత్సారాలు గడిచినా.. భార్య భర్తల (wife and husband )మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. దీంతో ఇద్దరు పిల్లలను పక్క గదిలో పడుకోమని భర్త దారుణంగా వ్యవహారించాడు. అర్థరాత్రి ఆమెను విచక్షణరహితంగా కొట్టి ప్లాస్టిక్ తాడుతో ఉరివేసి చంపాడు.( murder ) ఆ తార్వత తాపిగా తన ఆటోలో శవాన్ని తీసుకుని సొంత ఊరికి వెళ్లాడు.ఆ తర్వాత పిల్లలకు ఫోన్ చేసి అమ్మకు బీపి తగ్గింది మీరుకూడా ఊరికి వచ్చేయండి అంటూ ఫోన్ చేశాడు.

    వివరాల్లోకి వెళితే.. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా (nalogonda )నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో పస్తాల గ్రామానికి చెందిన చిత్తలూరి శ్రీనివాస్, సూరాంబ (35) దంపతులు తమ పిల్లలు శ్రావణి, ప్రశాంత్‌‌లతో కలిసి గత పదేళ్లుగా హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌లో (Ramantapur) నివసిస్తూ కూరగాయల వ్యాపారం ( vegitable Business) చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఇటివల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి శ్రీనివాస్‌ ఇంట్లో ఇద్దరు పిల్లలను పక్క గదిలో నిద్రించమని చెప్పి భార్యతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో సూరాంబను విచక్షణారహితంగా కొట్టి, ప్లాస్టిక్‌ తాడుతో ఆమె మెడకు ఉరివేసి హత్య చేశాడు.

    ఇది చదవండి :  సర్పంచ్‌ను చెప్పుతో కొట్టిన మహిళా ఉప సర్పంచ్.. ! కారణం ఇదే... !


    ఆ తర్వాత తాపిగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూరగాయలకు వినియోగించే తన టాటా ఏస్‌ వాహనంలో ( vehcle )ఆమె మృతదేహాన్ని వేసుకొని ఇంట్లో ఉన్న పిల్లలకు కనీసం సమచారం లేకుండా స్వగ్రామం పస్తాలకు బయల్దేరాడు. మార్గమధ్యలో గురువారం తెల్లవారుజామున పిల్లలకు ఫోన్‌చేసి ( phone )మీ అమ్మకు బీపీ డౌన్‌ అయ్యి మృతి చెందింది. మన గ్రామం పస్తాలకు తీసుకెళ్తున్నా, మీరు కూడా రండి అంటూ ఫోన్ చేసి చెప్పాడు..

    ఇది చదవండి :మొదటి జండా ఎగిరేది భూపాలపల్లిలోనే.. సోనియా రుణం తీర్చుకునే సమయం వచ్చింది..


    అనంతరం భార్య మృతదేహాన్ని స్వగ్రామం పస్తాలకు తీసుకొచ్చి తన ఇంటిముందు ఉంచాడు. అనంతరం గ్రామస్థులకు కూడా సేమ్ స్టోరీ చెప్పాడు.. వారికూడ బీపీ డౌన్‌ అయ్యి మృతి చెందిందని గ్రామస్తులతో చెప్పారు.. అయితే శ్రీనివాస్ మాటలపై అనుమానాలు ( Doubt )రేకెత్తిన గ్రామస్థులు ఆమె మృతదేహంపై ఉన్న గాయాలను గుర్తించి ఏమైందని నిలదీశారు. దీంతో శ్రీనివాస్‌ తానే చంపానని ఒప్పుకున్నాడు... అనంతరం అక్కడ ఉండకుండా..

    గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ క్రమంలోనే గ్రామస్తులు పోలీసులకు ( police )సమాచారం అందించడంతో పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి ( govt hospital ) తరలించారు. ఆ తర్వాత మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేశ్‌ తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published: