Home /News /telangana /

నవవధువు హత్య కేసులో కొత్త ట్విస్ట్.. భార్యను చంపేసిన తర్వాత ఆమె ఫోన్ నుంచే అతడికి మెసేజ్..!

నవవధువు హత్య కేసులో కొత్త ట్విస్ట్.. భార్యను చంపేసిన తర్వాత ఆమె ఫోన్ నుంచే అతడికి మెసేజ్..!

మృతురాలు నవ్య రెడ్డి

మృతురాలు నవ్య రెడ్డి

పెళ్లయిన రెండు నెలల్లోనే భార్యను చంపేందుకు భర్త సిద్ధమయ్యాడు. ఆమెను బైక్ పై ఎక్కించుకుని ఊరి చివరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి, చున్నీతో ఉరి బిగించి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మొబైల్ నుంచే ఒకరికి మెసేజ్ పెట్టాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
    ఖమ్మం జిల్లాలో దారుణ హత్యకు గురైన నవ వధువు కేసులో కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. పెళ్లయిన రెండు నెలల్లోనే భార్యను చంపేందుకు భర్త సిద్ధమయ్యాడు. ఆమెను బైక్ పై ఎక్కించుకుని ఊరి చివరకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తు టాబ్లెట్లు ఇచ్చి, చున్నీతో ఉరి బిగించి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మొబైల్ నుంచే ఒకరికి మెసేజ్ పెట్టాడు. ఆ ఫోన్ ను అక్కడే వదిలేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదుచేసుకున్న పోలీసులు, ఆ తర్వాత నిజాలు బయటపడుతుండటంతో హత్య కేసుగా మార్చారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలం మండలం అయ్యవారి గూడెంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెనికి చెందిన నాగ శేషు రెడ్డికి తమ సమీప నవ్య రెడ్డితో రెండు నెలల క్రిందట పెళ్లయింది. నాగ శేషు రెడ్డి పూణెలో ఉద్యోగం చేస్తుంటాడు. నవ్యకు అతడు స్వయానా మేన మామ కొడుకు. నవ్య సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం భార్య నవ్య రెడ్డి కనిపించడం లేదంటూ భర్త నాగ శేషు రెడ్డి ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి గ్రామ శివార్లలోని కుక్కల గుట్ట వద్ద నవ్య రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

    ఆమెను భర్తే హత్య చేసి ఉంటాడన్న అనుమానంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. భర్త నాగ శేషు రెడ్డి కదలికలపై అనుమానం వచ్చిన పోలీస్ లు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదు అయిన దృశ్యాల ఆధారంగా నాగ శేషు రెడ్డి ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆశలు విషయం వెలుగు చూసింది. బుదవారం రాత్రి సమయం లో నవ్య రెడ్డి ని బైక్ పై తీసుకు వచ్చి కుక్కల గుట్ట వద్ద మత్తు టాబ్లెట్ లు ఇచ్చి అనంతరం చున్ని తో ఉరి వేసి హత్య వేశాడు. ఆ తరువాత హత్య ను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతురాలి సెల్ ఫోన్ నుండి ఆమె తండ్రికి మెసేజ్ చేశాడు.

    ’నాన్నా, నాకు బీటెక్ లో ఇంకా సబ్జెక్టులు ఉన్నాయి. ఈ బ్యాక్ లాగ్స్ ను పాస్ కావడం నా వల్ల కావడం లేదు. అందుకే నేను చనిపోతున్నా‘ అని ఆమె మొబైల్ నుంచే ఆమె తండ్రికి మెసేజ్ పెట్టాడు. ఆ తరువాత ఏర్రు పాలెం పోలీస్ స్టేషన్ లో తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. నాగశేషు రెడ్డి నిజం ఒప్పుకోవడంతో మిస్సింగ్ కేసును కాస్తా, హత్య కేసుగా మార్చి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇదిలా ఉండగా, హత్యకు గల కారణాలు ఏంటన్నది అనుమానాస్పదంగా మారింది.

    పెళ్లైయిన కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. నవ్య తరచూ సెల్ ఫోన్ చాటింగ్స్‌లో నిమగ్నమై ఉండడంతో నాగశేషు ఆమెపై అనుమానం పెంచుకున్నారు. ఎవరితోనో క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు భావించాడు. ఈ క్రమంలోనే భార్యతో పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. అయితే తన మాటలు వినడం లేదని భావించిన నాగశేషు ఆమెను హత్య చేయాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Marriage, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు