భార్యపై అనుమానం.. తెల్లవారుజామున ఆమె బాత్రూంలోకి వెళ్లడం చూసిన భర్త.. ఆమె వెనుకే వెళ్లి..

భార్యను చంపిన శంకరయ్య

భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం శంకరయ్యలో మొదలయింది. అప్పుడప్పుడు ఫోన్లోనూ, ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో గొడవపడేవాడు. ఆమెను కొట్టేవాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి..

 • Share this:
  అనుమానం అనే పెనుభూతం కాపురాలను కూల్చుతోంది. రోజూ ఏదో ఒక మూల ఎక్కడో ఓ చోట ఘోరం జరుగుతూనే ఉంది. ప్రియుడి సాయంతో భర్తను భార్య కడతేర్చడమో, ప్రేయసి మోజులో పడి భర్తే భార్యను చంపేయడమో జరుగుతున్నాయి. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానపడి వారిని కడతేర్చిన భర్తలు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. భార్యపై అనుమానపడి తరచూ గొడవపడుతున్న భర్త, చివరకు ఆమెను అంతమొందించాడు. తెల్లవారుజామున ఆమె ఇంటి బయట ఉన్న బాత్రూంలోకి వెళ్లడం చూసిన భర్త అదే సరైన సమయం అనుకున్నాడు. ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని బాత్రూంలో ఉన్న భార్యపై దాడి చేశాడు. ఆ తర్వాత తెల్లారే వరకు బాత్రూం ముందే కూర్చున్నాడు. తెల్లారిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల శంకరయ్య ముంబాయిలోని కల్లు దుకాణంలో పనిచేస్తూ ఉండేవాడు. అతడికి 37ఏళ్ల వయసున్న భార్య సుజాత, 12 ఏళ్ల వయసులోపు ఇద్దరు కొడుకులు ఉన్నారు. తల్లీకొడుకులు చర్లపల్లిలోనే సొంత ఇంట్లో ఉంటుండగా, భర్త శంకరయ్య మాత్రం ముంబాయిలో ఉండేవాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. అయితే తాను వేరే ప్రాంతంలో ఉండటంతో భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం శంకరయ్యలో మొదలయింది. అప్పుడప్పుడు ఫోన్లోనూ, ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో గొడవపడేవాడు. ఆమెను కొట్టేవాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. ఈ రెండు నెలల్లో కూడా ప్రతీరోజూ ఆమెతో ఏదో ఒక కారణంతో గొడపడేవాడు.

  ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్.. రూ.3000 కోసం ట్రై చేస్తే.. ఏకంగా రూ.6,00,000 పోగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..

  రోజురోజుకు శంకరయ్యలో అనుమానం మరింత బలపడిపోయి ఆమెను చంపాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. సోమవారం తెల్లవారుజామున భార్య సుజాత బాత్రూంలోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన శంకరయ్య బాత్రూంలోకి వెళ్లి గొడ్డలితో విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తెల్లారే వరకు శంకరయ్య బాత్రూం గుమ్మం వద్దే కూర్చుండిపోయాడు. తెల్లవారిన తర్వాత ఈ ఘటనను చూసిన పిల్లలు, స్థానికులు హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి సోదరుడు ఈ ఘటనపై కేసు పెట్టాడు. దీంతో పోలీసులు శంకరయ్యను అదుపులోకి తీసుకున్నారు.
  ఇది కూడా చదవండి: బావిలోంచి అరుపులు.. ఏంటా అని చూస్తే లోపల ఓ యువతి, ఓ యువకుడు.. అసలేం జరిగిందంటే..
  Published by:Hasaan Kandula
  First published: