HUSBAND KILLED WIFE HITTING WITH STONE IN PUBLIC IN PEDDAPALLY DISTRICT VRY
Peddapally : పంచాయితీలోనే భార్యను.. బండతో కొట్టి ప్రాణాలు తీసిన భర్త
husband killed wife
Peddapally : పంచాయితీ సమయంలోనే భర్తను వదిలి వెళుతున్న భార్యపై దారుణానికి ఒడిగట్టాడు.. తనకు భర్త వద్ద ఉండనట్టు వెళ్లిపోతున్న భార్యను బండరాయితో మోది చంపాడు.
పెద్దపల్లి జిల్లాలో ( Peddapalli ) దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని కాసిపేట మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన రేణుక ఆమె భర్త చేతిలో దారుణంగా బలైంది. ( Husband killed wife hitting with stone ) భార్యభర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలోనే ఇరువురు పంచాయితీ పెద్దమనుష్యుల వద్ద చర్చించుకుంటుండగానే ఈ దారుణానికి భర్త ఒడిగట్టాడు.
వివరాల్లోకి వెళితే.. గత కొద్దిరోజులుగా ఇరువురు భార్యభర్తల మధ్య తరచు గొడవలు చెలరేగుతున్నాయి. దీంతో రేణుక తీవ్ర మనస్థాపానికి గురయ్యెది. ఇలాంటి విభేదాల నేపథ్యంలోనే తాను భర్తతో ఉండలేనట్టు మొండికేసింది. అయితే ఇరువురి భార్య భర్తలకు సర్థిచెప్పేందుకు గ్రామంలోనే పెద్దమనుష్యులు నేడు పంచాయితీ నిర్వహించారు. ( Husband killed wife hitting with stone )ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాని రేణుక మాత్రం వారి మాటలను వినలేదు. వాళ్లు ఎంత చెప్పినా తాను భర్తతో ఉండలేనంటూ మధ్యలోనే వెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది.
దీంతో రెచ్చిపోయిన ఆమె భర్త విచక్షణ కోల్పోయాడు. పంచాయితీ జరుగుతుండగానే భార్యను బండరాయితో తీవ్రంగా తలపై కొట్టాడు. దీంతో ఆమె తీవ్రగాయాలతో సృహతప్పి పోయింది. ( Husband killed wife hitting with stone )కొద్ది సేపటి తర్వాత తన ప్రాణాలను కోల్పోయింది. విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేయడంతో.. సంఘటన స్థలానికి చేరకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల భార్య చనిపోవడంతో పాటు జీవిత కాలం జైలులో ఉండాల్సిన పరిస్థితి ఆ భర్తకు ఏర్పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.