హోమ్ /వార్తలు /తెలంగాణ /

Wife murder : రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని ... భార్యని ఏం చేశాడో తెలుసా...?

Wife murder : రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని ... భార్యని ఏం చేశాడో తెలుసా...?

(ప్రతీకాత్మక చిత్రం )

(ప్రతీకాత్మక చిత్రం )

wife murder : మద్యానికి బానిసైన ఓ రైతు రోజు భార్యను డబ్బుల కోసం వేధిస్తున్న భర్త రైతుబంధు డబ్బులు కావాలన్నాడు. అందుకు అంగీకరించని భార్యను మద్యం మైకంలో అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న భార్యను గొడ్డలితో నరికి చంపాడు.

న్యూస్ 18 మహబూబ్ నగర్...

సయ్యద్ రఫీ...

నారాయణపేట జిల్లా పరిధిలోగల మక్తల్ మండలం చందాపూర్ లో చోటు చేసుకున్నా ఈ ఘటన అందరిని కలచి వేసింది. గ్రామస్తుల కథనం ప్రకారం చందాపూర్ గ్రామానికి చెందిన సత్యమ్మ 45 రాములు పంతులకు 20 ఏళ్ల క్రితమే పెళ్లి జరిగింది..వారికి ముగ్గురు మగ పిల్లలు ,ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. భార్యభర్తలిద్దరు భూమిలో సాగు చేయడంతోపాటు కూలి పనులు చేసుకుంటారు. వీరి పెద్ద కుమారుడు కురుమూర్తి గోవిందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ లో వరి కోత యంత్రం నడిపి పనిలో ఉన్నాడు.

మరోవైపు ఇటివలే ఇల్లు పాతది కావడంతో పెద్ద కొడుకు సహాయంతో కొత్త ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. అందరు కష్టపడి ఇల్లు నిర్మాణం చేసుకుంటున్న తరుణంలో రాములు కొన్నేళ్లుగా తాగుడుకు బానిసై ఎప్పుడు డబ్బుల కోసం వేధిస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న పెద్ద కొడుకు ఇంటి నిర్మాణ ఖర్చుల కోసం కొంత డబ్బును పంపాడు..దీనికి తోడు ఇటివల రైతు బంధు సంబంధించి డబ్బులు కూడా డిపాజిట్ అయ్యాయి.

దీంతో రాములు తాగేందుకు రైతుబంధు డబ్బులను తీసి ఇవ్వాలని భార్యతో గొడవపడుతున్నాడు. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు అవసరం అవుతాయని చెప్పినా.. వినకుండా ఘర్షణకు దిగాడు. దీంతో భార్యభర్తల మధ్య తీవ్రస్థాయిలో చెలరేగింది. అనంతరం బయటకు వెళ్లిన రాములు మద్యం మత్తులో అర్థరాత్రి ఇంటికి చేరుకున్నాడు. డబ్బులు ఇవ్వలేదన్న కక్షను పెంచుకున్న రాములు గాఢనిద్రలో ఉన్న భార్యను గొడ్డలితో నరికాడు. దీంతో ఒక్కవేటుకే ఆమె మృత్యువాత పడింది..

అయితే భార్యను హత్య చేసిన తర్వాత రాములు తెల్లవార్లు ఇంట్లోనే కూర్చుకున్నాడు.. మత్తు వదిలిన తర్వాత ఉదయం రోడ్డుపైకి తానే స్వయంగా వచ్చి భార్యను చంపానని, తాను కూడా ఉరివేసుకుని చనిపోతానని రోడ్డుపై పరుగెత్తుకుంటూ వెళుతుంటూ గ్రామస్థులు అడ్డగించి పోలీసులకు పిర్యాదు చేశారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాములును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Mahabubnagar

ఉత్తమ కథలు