Home /News /telangana /

HUSBAND KILLED WIFE BOY FRIEND WHILE HE CAME TO HOME AT NIGHT FOR HER IN HYDERABAD FULL DETAILS HERE HSN

ప్లీజ్.. ఇంట్లో నా భర్త నిద్రపోతున్నాడని చెప్పినా బలవంతం చేయడంతో.. ప్రియుడిని లోపలికి రానిచ్చిన భార్య.. ఆ తర్వాత..

ముఖ్రం (ఫైల్ ఫొటో)

ముఖ్రం (ఫైల్ ఫొటో)

మార్చి 6వ తారీఖున రాత్రి మౌలాలీలోని ఓ కార్యక్రమానికి ముఖ్రం తన తల్లితో కలిసి వచ్చాడు. ఆ కార్యక్రమంలో తల్లిని దించేసి పెట్రోల్ పోయించుకుని వస్తానని చెప్పి సల్మా బేగం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఇంట్లో తన భర్త ఉన్నాడని, నిద్రపోతున్నాడని చెప్పినా కూడా అతడు వినలేదు.

ఇంకా చదవండి ...
  వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతూ ఉన్నాయి. ఎంతో మంది దారుణంగా హత్యలకు గురవుతున్నారు. ప్రియుడి మోజులో పడి భర్తను భార్య కడతేర్చడమో, ప్రేయసి మోజులో పడి భర్తే భార్యను చంపేయడమో వంటి ఘటనలు ఎన్నో్ జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ప్రియుడే హతమయ్యాడు. స్నేహితుడి భార్యతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న అతడు, తరచూ ఆమెను వేధించేవాడు. ఈ విషయం కాస్తా భర్తకు తెలియడంతో ఇల్లు వదిలి వేరే చోటకు మకాం మార్చాడు. అయినప్పటికీ భార్యకు అతడి వేధింపులు ఆగకపోవడంతో చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఓ రోజు రాత్రి వేళ ఆమెను కలిసేందుకు వచ్చిన అతడిని ఇద్దరూ కలిసి మట్టుబెట్టారు. చివరకు పోలీసుల విచారణలో దొరికిపోయారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  సికింద్రాబాద్ కార్ఖానాకు చెందిన మహ్మద్ ముఖ్రం అనే 25 ఏళ్ల యువకుడు సిటీలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి సమీప బంధువైన మహ్మద్ మజీద్ అనే 36 ఏళ్ల వ్యక్తి ఇంటికి తరచూ వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే మజీద్ 30 ఏళ్ల భార్య అయిన సల్మా బేగంతో మహ్మద్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. మజీద్ లేని సమయంలో ఇంటికి వచ్చి, ఆమెను బెదిరించి లొంగదీసుకునేవాడు. ఈ విషయం మజీద్ కు తెలియడంతో తన ఇంటి మకాంను మార్చేశాడు. కుటుంబంతో సహా మౌలాలిలోని షఫీనగర్ కు వెళ్లాడు. అయితే అక్కడకు కూడా ముఖ్రం వచ్చి సల్మా బేగంను వేధించేవాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందన్న భయంతో ఆమె అతడి ఆగడాలను భరిస్తూ వచ్చింది. చివరకు ఓపిక పట్టలేక భర్తకు చెప్పేసింది. దీంతో వారిద్దరూ కలిసి అతడి అడ్డు తొలగించుకోవాలనుకున్నారు.
  ఇది కూడా చదవండి: పెళ్లయి ఐదుగురు పిల్లలు ఉన్న మహిళ.. భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి.. ఇంటి ముందున్న గుంటలో బయటపడిన బండారం..!

  మార్చి 6వ తారీఖున రాత్రి మౌలాలీలోని ఓ కార్యక్రమానికి ముఖ్రం తన తల్లితో కలిసి వచ్చాడు. ఆ కార్యక్రమంలో తల్లిని దించేసి పెట్రోల్ పోయించుకుని వస్తానని చెప్పి సల్మా బేగం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఇంట్లో తన భర్త ఉన్నాడని, నిద్రపోతున్నాడని చెప్పినా కూడా అతడు వినలేదు. అతడు బలవంత పెట్టడంతో ఇంటి లోపలికి అతడిని ఆహ్వానించింది. అతడిని మంచంపై కూర్చోబెట్టి కబుర్లు చెప్పింది. ఇంతలోనే సడన్ గా అతడిని వెనక్కు తోసేసింది. అప్పటికే మంచం దగ్గరే చాటుగా మాటు వేసి ఉన్న భర్త అతడి మెడక్ భార్య స్కార్ఫ్ ను బిగించాడు. ముఖంపై దిండును పెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. ఇదే సమయంలో ముఖ్రం కాళ్లు, చేతులను సల్మా బేగం పట్టుకుంది.
  ఇది కూడా చదవండి: ప్లీజ్.. నన్ను రెండో పెళ్లయినా చేసుకోమని కోరిన యువతి.. నో చెప్పిన ప్రియుడు.. ఆ భగ్న ప్రేమికురాలు ఎంతకు తెగించిందంటే..

  అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి తాళం వేసి పరారయ్యారు. పెట్రోల్ కొట్టించుకుని వస్తానని వెళ్లిన కొడుకు ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఆదివారం ఉదయం మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్రం కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ఎక్కువగా మజీద్ భార్యతోనూ, మజీద్ తోనూ మాట్లాడినట్టు గుర్తించారు. దీంతో వారి ఇంటికి వెళ్తే అక్కడ తాళం వేసినట్టు గుర్తించారు. పోలీసులు కాపు కాసి మౌలాలిలో ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి వారిద్దరూ నేరాన్ని అంగీకరించడంతో ఆ దంపతులను బుధవారం రిమాండ్ కు తరలించారు. కాగా, తల్లిదండ్రుల అరెస్ట్ తో వారి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. వారిని బంధువులు తీసుకెళ్లారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, Hyderabad, Illegal affairs, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు