హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sangareddy news :బండలు కొట్టె సుత్తితో తలపై బాది ప్రాణాలు తీసిన భర్త..ఇంతకి ఆమె ఏం చేసింది..

Sangareddy news :బండలు కొట్టె సుత్తితో తలపై బాది ప్రాణాలు తీసిన భర్త..ఇంతకి ఆమె ఏం చేసింది..

ప్రాణాలు కొల్పోయిన రాజేశ్వరి

ప్రాణాలు కొల్పోయిన రాజేశ్వరి

Sangareddy news : అనుమానంతో నరహంతకుడిగా మారాడు ఓ భర్త.. గత రాత్రి నిద్రలో ఉన్న భార్యపై, రాళ్లు కొట్టే సుత్తితో తలపై బలంగా బాదాడు..దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

News18 ప్రతినిధి

కె.వీరన్న

మెదక్ జిల్లా

కట్టుకున్న భార్య, అమెపై అనుమానం..పెళ్లి చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా ఆమెకు చిత్రహింసలు....... అన్న ,అక్కా ,చెల్లి ఇలా ఎవరితో ఫోనో‌లో మాట్లాడినా భర్త అనుమానంతో చూసేవాడు..రాళ్లు కొడుతూ కూలి పనులు చేస్తూ..వచ్చిన డబ్బులు కూడా తాగుడు తగిలేసే మనస్తత్వం ఉన్న భర్తకు అనుమానం పెనుభూతం అయింది.. భార్య తరచు ఫోన్ మాట్లాడడం తట్టుకోలేని భర్త నిద్రలోనే ఆమెను కడతేర్చాడు. తాను రాళ్లు కొడుతున్న సుత్తితో తలమీద బాది ప్రాణాలు తీశాడు.

వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్కుల్ గ్రామంలోని వడ్డెర కాలనీలో గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం చిట్కుల్ గ్రామానికి చెందిన మెఘవేలు రాజేశ్వరి భార్య భర్తలు . మెఘవేలు రాళ్లు కొడుతూ జీవనం కొనసాగిస్తుండగా భార్య రోజువారి కూలి పనులు చేస్తుంటుంది. వీరికి అయిదు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు..అయితే రాజేశ్వర్ తన కుటుంభ సభ్యులతో పాటు ఇతరులతో ఫోన్‌లో తరచూ మాట్లాడుతుండేది..

అయితే ఇలా తరచుగా ఫోన్ మాట్లాడుతుండడంతో భర్త మెఘవేలు అనుమానం పడ్డాడు.ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే ఆమె తరచుగా ఫోన్‌లో మాట్లాడుతుందని నమ్మాడు. దీంతో భార్యతో తరచూ ఘర్షణ పడుతూ చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో వారిని రాజేశ్వరి తన ఇంటికి తీసుకువచ్చింది. అక్కడే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నా.. మెఘవేలు మాత్రం అనుమానం పోలేదు..ఇలా ఘర్షణ వాతవరణంలోనే మరోసారి రాజేశ్వరి ఫోన్ మాట్లాడడం చూశాడు. దీంతో రాత్రి ఆమె పడుకున్న తర్వాత తనా బండలు కొట్టె సుత్తితో నెత్తిపై దారుణంగా బాదాడు .


దీంతో ఆమె రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండడంతో కనీసం భార్య అనే కనికరం లేకుండా వ్యవహరించాడు. అదే సుత్తితో రోడ్డుమీదకు పరుగెత్తుకుంటూ వచ్చి నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. అయితే మెఘవేలు సుత్తితో పరుగెత్తడం చూసిన పక్కింటి వారు ఇంట్లోకి వెళ్లి చూడడంతో రాజేశ్వరి రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టతుండంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.అయితే తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్త స్రావం జరిగి ఆమె మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.

First published:

Tags: Crime, Husband kill wife, Kills, Medak

ఉత్తమ కథలు