Home /News /telangana /

HUSBAND KILLED HIS NEWLY MARRIED WIFE IN GADWAL DISTRICT

TS crime : సెల్ఫీ పేరుతో భార్యను కోండపై నుండి తోసేసిన భర్త.. పెళ్లై రెండు నెలలు కాకముందే దారణం ..

హత్యకు గురైన శరణ్య ,

హత్యకు గురైన శరణ్య ,

TS crime : పెళ్లై రెండు నెలలు కూడా కాకముందే భార్యపై అనుమానాలు పెంచుకున్న భర్త..సెల్ఫీ పేరుతో భార్యను కొండపై నుండి నెట్టెశాడు..భార్య తప్పిపోయిందంటూ అత్తమామాలకు చెప్పి కథలు చెప్పాడు..కాని హత్య జరిగిన రెండు రోజుల్లోనే పోలీసులు నిజాన్ని చేధించారు..

ఇంకా చదవండి ...
    కట్టుకున్న భార్యపై అనుమానాలు పెంచుకున్నాడు..తనకున్న అలవాట్లు భార్యకు కూడా ఉన్నాయని భ్రమపడ్డాడు..దీంతో పెళ్లై రెండు నెలలు కూడా కాని భార్యను అనుమానపు చూపులు చూశాడు. ఆమె ఫోన్ మాట్లాడిన విపరీతంగా చలించిపోయాడు..లాభం లేదు ఇక వద్దనుకుని దారుణానికి ఒడిగట్టాడు..ఆమెకు అక్రమ సంబంధాలను అంటగట్టబోయి అడ్డంగా ఇరుకున్నాడు.పోలీసుల అసలు విచారణలో తనకే ప్రియురాలు ఉండడంతో ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం భార్యను కడతేర్చిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.

    జిల్లాలోని గట్టు మండలం చిన్నోని పల్లే గ్రామానికి చెందిన జయరాములు గౌడ్‌కు ఆలంపూర్ మండలం జిల్లెల గ్రామానికి చెందిన మద్దిలేటి శరణ్యకు గత రెండు నెలల క్రితం పెళ్లి జరిగింది.అయితే జయరాములు గౌడ్‌కు అప్పటికే వేరే అమ్మాయితో సంబంధం ఉండడంతో పాటు తన భార్యపై అనుమానాలు మొదలు పెట్టాడు.దీంతో ఎలాగైన తాను ప్రేమించిన అమ్మాయి కోసం భార్యను హత్య చేయాలని నిర్ణయించాడు.

    ఇక ఇందుకోసం ఎవరికి అనుమానం రాకుండా ఉండే ప్లేస్ కోసం వెతికాడు. అయితే తాను ఇంటర్ చదువుతున్నప్పుడు చూసిన వెళ్లిన తిరులమయ్య గుట్ట అయితే ఎవరికి అనుమానం రాదని భావించాడు. ఈ నేపథ్యంలోనే తన పథకాన్ని ఈనెల 11 తేదిన అమలు చేశాడు. ఆధార్ కార్డులో అడ్రస్ మారుస్తామని, భార్యను తీసుకుని అయిజ మండల కేంద్రానికి వెళ్లాడు.ఇక అక్కడ నుండి తాను అనుకున్నట్టుగా సమీపంలోని తిరుమలయ్య గుట్టకు గుడి పేరుతో తీసుకువెళ్లాడు. గుట్ట చివరి అంచుకు తీసుకువెళ్లి ఎవరు చూడని సమయంలో సెల్ఫీ దిగుతామని చెప్పాడు. దాంతో నమ్మిన శరణ్య గుట్ట కొసకు నిలబడడంతో అక్కడి నుండి తోసి వేశాడు.దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడించింది.

    ఇక అక్కడి నుండి తాను తప్పించుకునే ప్లాన్ వేశాడు. వెంటనే తన అత్తమామలకు ఫోన్ చేసి శరణ్య కనిపించడం లేదంటూ చెప్పాడు. తాను ఆధార్ కార్డు అడ్రస్ మార్పు కోసం అయిజకు వెళ్లామని అయితే అక్కడ నెట్ వర్క్ ప్రాబ్లం రావడంతో మరో చోటికి వెళ్లామని ఈ పరిస్థితుల్లోనే ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకువెళుతున్న సమయంలో మధ్యలో బస్టాండ్ వద్ద బైక్ రిపేరు వచ్చిందని..ఈ క్రమంలోనే అక్కడే ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లమని చెప్పానని అయితే..ఆమె అక్కడికి వెళ్లలేదని నమ్మించాడు.

    అయితే అల్లుడి మాటలు నమ్మని శరణ్య తండ్రి రెండు రోజుల క్రితం స్థానిక అయిజ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమ స్టైల్లో నిందితున్ని విచారించారు. అనంతరం శరణ్యను తాను కొండపై నుండి తోసి వేశానని చెప్పాడు. దీంతో అక్కడి తీసుకువెళ్లాడు. శవాన్ని గుర్తించి పోస్టుమార్టంకు పంపించారు..జయరాములు గౌడ్‌పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు పోలీసులు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Gadwal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు