సారీ, నేను చచ్చిపోతున్నా.. పిల్లలను బాగా చదివించు.. అంటూ భార్యకు ఆ భర్త చివరి సారి వీడియో కాల్ చేసి..

ప్రతీకాత్మక చిత్రం

సారీ, నేను మీకు ఏమీ చేయలేకపోతున్నా. నన్ను పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడ్డావు. ఇప్పుడు ఇద్దరు కూతుళ్లను పెంచి పోషిస్తున్నావు. నేను ఉండి ఏం లాభం లేకుండా పోయింది. ఇక నా వల్ల కాదు. నన్ను క్షమించు. నేను చచ్చిపోతున్నా.. అంటూ..

 • Share this:
  ‘సారీ, నేను మీకు ఏమీ చేయలేకపోతున్నా. నన్ను పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడ్డావు. ఇప్పుడు ఇద్దరు కూతుళ్లను పెంచి పోషిస్తున్నావు. నేను ఉండి ఏం లాభం లేకుండా పోయింది. ఇక నా వల్ల కాదు. నన్ను క్షమించు. నేను చచ్చిపోతున్నా. పిల్లలను మంచిగా చూసుకో. వారిని బాగా చదివించు’ అంటూ ఓ భర్త తన భార్యకు ఆఖరుసారి ఫోన్ చేశాడు. ఆమె వారించేలోపే ఫోన్ పెట్టేశాడు. ఆఘమేఘాల మీద భయంతో తన భర్త ఉండే ఊరికి వెళ్లి చూసిన భార్యకు షాకింగ్ దృశ్యం కనిపించింది. తన భర్త ఉంటున్న గది తలుపులు పగలగొట్టి చూస్తే అతడి మృతదేహం కనిపించింది. దాన్ని చూసిన ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తెలంగాణలోని సూర్యాపటే జిల్లా కోదాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన రుంజా అశోక్ అనే 32 ఏళ్ల వ్యక్తి టాటా ఏస్ వాహనం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి కొన్నేళ్ల క్రితమే ఖమ్మం జిల్లా కాపుగల్లుకు చెందిన మహిళతో పెళ్లయింది. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో అతడికి ఉపాధి లేకుండా పోయింది. పని దొరక్క చాలా కాలం పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో భార్యే చిన్న చిన్న కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించింది. నెల రోజుల క్రితమే ఉపాధి కోసం కుటుంబమంతా కలిసి సూర్యాపేట జిల్లా కోదాడ నగరానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు.
  ఇది కూడా చదవండి: 40 ఏళ్లుగా సౌదీలోనే.. హైదరాబాద్ కు శాశ్వతంగా తిరిగొస్తుండగా భర్త మృతి.. కనీసం అస్థికలనైనా ఇప్పించండంటూ భార్య కన్నీటి విన్నపం

  పెద్దగా పనులు లేకపోవడంతో భార్యాపిల్లలను పుట్టింటికి పంపించేశాడు. తాగుడుకు అలవాటు పడి ఒంటరిగా గడిపాడు. శుక్రవారం రాత్రి భార్యకు వీడియో కాల్ చేశాడు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నేను ఉండి లాభం లేకుండా పోతోంది. పిల్లలను సరిగ్గా చూసుకో. వాళ్లను బాగా చదివించు‘ అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో కంగారు పడిన భార్య వెంటనే కోదాడకు బయలుదేరి వచ్చింది. అద్దెకు ఉంటున్న ఇంటికి లోపల తలుపు వేసి ఉంది. దీంతో తలుపులను పగలగొట్టి చూస్తే, అప్పటికే అతడు ఉరి వేసుకుని చనిపోయినట్టు కనిపించింది. ఈ ఘటనపనై పోలీసులకు అతడి తండ్రి దావీదు ఫిర్యాదు చేశాడు. కోదాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. ఆర్థిక కష్టాలు, తాగుడుకు అలవాటు పడటం వల్లే ఈ దారుణం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
  ఇది కూడా చదవండి: బయటపడ్డ అసలు నిజం.. గంటకో కట్టుకథ చెబుతూ ముప్పతిప్పలు.. పోలీసులకు డౌట్ రాకుండా ప్రియుడిని భయ్యా అని పిలిస్తూ..
  Published by:Hasaan Kandula
  First published: