Police illegal affair : మరో ఎస్సై.. కానిస్టేబుల్.. అక్రమ సంబంధం...భరించలేని భర్త ఆత్మహత్య...!

Police crime : మరో ఎస్సై.. కానిస్టేబుల్.. అక్రమ సంబంధం...భరించలేని భర్త ఆత్మహత్య(ప్రతీకాత్మక చిత్రం

Police crime : తెలంగాణలో మరో ఎస్సై తన క్రింది స్థాయి లేడి కానిస్టేబుల్‌తో అక్రమ కొనసాగించాడు....ఒకే జిల్లా కావడంతో.. ట్రైనింగ్‌లో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది..ఈ ఇద్దరి అక్రమంతో చివరకు భర్త బలయ్యాడు..అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Share this:
ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు... వ్యక్తిగతంగా కట్టుతప్పుతున్నారు..ఓ వైపు సమాజంలో పలువురుని చట్టబద్దంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయాల్సిన వారు , వాళ్లే చట్టవ్వతిరేకంగా తయారవుతున్నారు..అధికారం ఉందని విచ్చల విడిగా అక్ర సంబంధాలకు తెగపడుతున్నారు..ఉన్న డిపార్ట్‌మెంట్‌లోనే ప్రత్యేక  సంబంధాలను కొనసాగిస్తున్నారు..

ఇటివలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎస్సై పంచాయితీ కోసం వచ్చిన మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు.. పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చాడు..దీంతో ఆ మహిళ భర్తనుండి విడాకులు తీసుకుని ప్రియుడైన ఎస్సై వద్దకు చేరింది..అప్పుడు ,ఆ ఎస్సై తన అసలు రంగును బయటపెట్టాడు. దీంతో మోసపోయిన మహిళ ప్రాణాలు విడిచేందుకు సిద్దమయింది...ఇలాంటి పోలీసులు అక్రమాలు నిత్యం బయటకు వస్తూనే ఉన్నాయి..అయితే తాజాగా మరో ఎస్సై తన క్రింది స్థాయిలో ఉండే కానిస్టేబుల్‌తో అక్రమాన్ని కొనసాగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది..

వివరాల్లోకి వెళితే..కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాధవపల్లి గ్రామానికి చెందిన చెందిన మహిళతో మహారాష్ట్రకు చెందిన శివాజీ రావు వివాహం జరిగింది..అయితే శివాజి రావు మహారాష్ట్రను వీడి మాధవపల్లిలోనే ఉంటున్నాడు. కాగా ఆయనకు ఓ కుమారుడు పుట్టిన తర్వాత 2008లో భార్య చనిపోయింది.. దీంతో కొద్ది రోజుల తర్వాత తన భార్య చెల్లెలైన మరదలును పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం రెండో భార్యకు ఓ పాప కూడా పుట్టింది..

ఇక ఆమె మూడు సంవత్సరాల క్రితం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించింది..దీంతో ఆమె ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది..ఈ సంధర్భంలోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ప్రోబెషనరీ ఎస్సైతో పరిచం ఏర్పడి...అది కాస్తా  వివాహేతర సంబంధాని దారి తీసింది. ..ఇక ట్రైనింగ్ తర్వాత ఎస్సైకి నిజామాబాద్ జిల్లాలో, కానిస్టేబుల్‌గా కామారెడ్డిలో ఆమెకు పోస్టింగ్ వచ్చాయి...

ఒకే జిల్లా..ఇద్దరికి తక్కువ దూరం ఉండడంతో పాటు ఒకే డిపార్ట్‌మెంట్ కావడంతో తమ అక్రమ సంబంధాన్ని పోస్టింగ్ తర్వాత కూడా కొనసాగించారు. అయితే ఇద్దరి అక్రమ సంబంధం భర్త శివాజీరావుకు తెలియడంతో ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తాయి..ఇలా రోజు గోడవలు ప్రారంభం కావడంతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న ఎస్సై రంగంలోకి దిగాడు..భర్త శివాజీ రావును వేధింపులకు గురి చేయడంతో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేశారు..దీంతో వేధింపులకు , అవమానాలకు తట్టుకోలేని శివాజీరావు తన ఇంట్లో బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సంధర్భంలోనే శివాజీరావు మృతికి ఎస్సై కారణమంటూ..ఆయన బంధువులు రోడ్డుపై రెండు గంటల పాటు బైఠాయించారు..దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది..పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించారు..కేసును నమోదు చేసి నిందితులపై చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో అందోళన చేస్తున్న బంధువులు వెనక్కి తగ్గారు.
Published by:yveerash yveerash
First published: