(K.Veeranna,News18,Medak)
చనిపోయే వరకు ఏదో ఒకటి సాధించాలని బ్రతికే వాళ్లను చూశాం. కాని కట్టుకున్న భార్యను సాధించడం కోసం చనిపోవాలని నిర్ణయం తీసుకున్న భర్త గురించి ఇప్పుడే వింటున్నాం. నూరేళ్ల జీవితాన్ని ఒక్క రొట్టెతో ముడిపెట్టి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించిన సంఘటన సంగారెడ్డి(Sangareddy)జిల్లాలో చోటుచేసుకుంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని కలిసి ఎదుర్కొవాల్సిన వ్యక్తి భార్య తాను చెప్పిన పని చేయలేదనే కోపంతో ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.సంగారెడ్డి జిల్లా పాశమైలారం(Pashamylaram) గ్రామానికి చెందిన మహ్మద్ సాబేర్ (Mohammed Saber)అనే 30సంవత్యరాల వ్యక్తి ఇండస్ట్రియల్ ఏరియా(Industrial Area)లోని ఓ ఫ్యాక్టరీలో జాబ్Job చేస్తున్నాడు. సోమవారం డ్యూటీ(Duty)ముగించుకొని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. భార్యను తినడానికి రొట్టెలు చేయమన్నాడు. అందుకు ఆమె ఇప్పుడు కుదరదు అని చెప్పింది. ఈవిషయంలోనే భార్యతో సాబేర్ గొడవపడ్డాడు.
రొట్టెల కోసం ప్రాణం తీసుకున్నాడు..
కేవలం రొట్టెల విషయంలో భార్య తనతో గొడవపడటం ..అదే సమయం తాను చెప్పినట్లుగా రొట్టెలు చేయనని చెప్పడంతో సాబేర్ అవమానంగా ఫీలయ్యాడు. రాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. భర్త సూసైడ్ చేసుకున్నట్లు గ్రహించిన భార్య వెంటనే చుట్టుపక్కల వాళ్లను పిలిపించింది. ఆమె రాత్రి భర్తతో జరిగిన గొడవ ఎవరితో చెప్పకపోవడంతో ఎందుకు చనిపోయాడో తెలియక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు సాబేర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హర్ట్ అయ్యాడు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాబేర్ భార్యతో పాటు స్థానికులను విచారించారు. వివరాలు సేకరించారు. మృతుడు మహ్మద్ సాబేర్ బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. జీవనోపాధి కోసం సంగారెడ్డి జిల్లాకు వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో నెల జీతానికి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం రాత్రి సాబేర్ రొట్టెలు చేయమంటే భార్య కోపంతో చేయనని చెప్పినందుకే బలవన్మరణం చేసుకున్నాడని సంగారెడ్డి బీడీఎల్ సీఐ వినాయకరెడ్డి తెలిపారు. కేవలం రొట్టెలు చేయలేదనే కారణంతోనే ప్రాణాలు తీసుకున్నాడా లేక భార్య,భర్తల మధ్య ఇంకా ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు రాబడుతున్నారు.
ప్రాణం విలువ తెలియని వాడు..
కలిసి నూరేళ్లు జీవించాల్సిన భార్యభర్తలు..కేవలం రొట్టెల విషయంలో గొడపడి నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవడం చూసి స్థానికులు విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం సొంత రాష్ట్రం వదిలి వచ్చి ..ఇక్కడ ప్రాణాలు తీసుకోవడంతో బీహార్‌లోని సాబేర్ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Husband commit suicide, Sangareddy