Home /News /telangana /

HUSBAND COMMITS SUICIDE AFTER WIFE ABUSE PRV KNR

పెళ్లయిన 8 నెలలకే అల్లుడికి చుక్కలు చూపించిన అత్తామామ.. మనస్తాపంతో ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జగిత్యాలకు చెందిన రుద్రాక్ష్​, జయశ్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల వరకు బాగానే ఉన్నారు. ఇంతలో యువతి తల్లిదండ్రులు ఇరువురిని చూడటానికి వచ్చారు. అల్లుడిని వేధించారు. సూటిపోటి మాటలతో నిందించారు. తాళలేక అల్లుడి తనువు చాలించాడు.

ఇంకా చదవండి ...
    ఎక్కడ చూసినా.. ఎప్పుడు చూసినా.. కట్నం కోసం భర్త వేధింపులు, అత్త, ఆడపడుచుల చిత్రహింసలు. ఇలాంటి వార్తలు చదివీ చదివీ.. చూసీ.. చూసీ.. విసిగిపోయాం. వీళ్లు మారరురా బాబాయ్​ అంటూ మగాళ్ల గురించి తిట్టుకునే మహిళలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ సీన్​ రివర్​ అయింది. భార్యే భర్తను నిందిస్తోంది. అత్తా మామలు అల్లుడిని సూటిపోటి మాటలతో రాచి రంపాన పెట్టారు. అంతేనా రోజు భార్య సైతం భర్తను చిన్నచూపు చూడటం మొదలెట్టింది. ఇరువురిదీ పెద్దలు కుదిర్చిన వివాహం కాదు. సాక్షాత్తూ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా పెళ్లి చేసుకొని ఎన్నో ఏళ్లు గడవలేదు. కేవలం  8 నెలలే అయింది. ఇద్దరూ వేరుగా ఉన్నా కొద్ది రోజులు బాగానే ఉన్నారు. కానీ, భార్య తల్లిదండ్రులు ప్రవేశించడంతో సీన్​ మారిపోయింది. అల్లుడేమో రోజు కష్టం చేసుకని బతికే వాడు కావడంతో వారికి రుచించలేదు. వెనకా ముందు ఆస్తి లేదని తిట్టడం మాటలు అనడం మొదలుపెట్టారు. ఇక తాళలేని అల్లుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

    ఆదిలాబాద్ పట్టణానికి చెందిన తలండి రుద్రాక్ష్ ( 28 ) అనే వ్యక్తి జీవనోపాధి నిమిత్తం రెండు నెలల క్రితం మండలంలోని బర్ధిపూర్ గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్​లో కూలీగా చేరాడు . అతడికి ఫేస్​బుక్ లో 8 నెలల క్రితం జయశ్రీ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి రుద్రాక్ష్, జయశ్రీలు వివాహం చేసుకున్నారు. నెల క్రితం జయశ్రీ తల్లిదండ్రులైన వినోద్, చంద్రబార్లు బరిపూర్ వచ్చారు. మొదట్లో ఇద్దరిని చూసి సంబరపడిపోయారు. కానీ, తర్వాతే మా కూతురిని సరిగా చూసుకోవడం లేదని నిందలు వేయడం మొదలుపెట్టారు. నీకు ఎలాంటి ఆస్తి లేదంటూ రుద్రాక్ష్ తో గొడవపడేవారు. అల్లుడిని మానసికంగా వేధించారు. మరోవైపు సోమవారం సాయంత్రం భార్య జయశ్రీ కూడా భర్తతో గొడవ పడింది. అంతేకాకుండా వెంటనే పుట్టింటికి వెళ్లిపోయింది . ఈ ఘటనలతో రుద్రాక్ష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గోధూర్ గ్రామశివారులోని ఓ ఫౌలీ ఫామ్ లో పని చేస్తున్న అక్క అగ్నిత దగ్గరకు రుద్ర వెళ్లాడు. భార్య గురించే ఆలోచించి, బాధతో రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.తన చావుకు భార్య, అత్తమామలే కారణమంటూ రుద్రాక్ష్ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. మృతుడి అక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నినిషా రెడ్డి తెలిపారు .
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Attemp to suicide, Karimnagar, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు