Home /News /telangana /

HUSBAND CAUGHT HIS WIFE ILLEGAL AFFAIR WITH AR CONSTABLE IN HYDERABAD SU

హైదరాబాద్.. హోటల్ రూమ్‌లో మహిళతో కానిస్టేబుల్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆ మహిళ భర్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హోటల్ రూమ్‌లో వేరే వ్యక్తి భార్యతో రాసలీలలు సాగిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం బట్టబయలైంది. స్వయంగా ఆ మహిళ భర్తే వారిద్దని రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు

    హోటల్ రూమ్‌లో వేరే వ్యక్తి భార్యతో రాసలీలలు సాగిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం బట్టబయలైంది. స్వయంగా ఆ మహిళ భర్తే వారిద్దని రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ మహిళ బ్యూటిపార్లర్‌లో పనిచేస్తున్నానని భర్తను నమ్మించింది. అయితే భార్య ప్రవర్తనపై అతనికి అనుమానం కలిగింది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.

    ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన తన భార్యను వెంబడించాడు. ఆమె ఏఆర్ కానిస్టేబుల్‌ వంశీతో హోటల్‌కు వెళ్లడాన్ని గుర్తించాడు. హోటల్ వద్దకు వెళ్లిన అతడు తలుపు తట్టాడు. అయితే గొంతు గుర్తుపట్టిన అతని భార్య బాత్‌రూమ్‌లోకి వెళ్లి దాకుంది. దీంతో అతడు పోలీసుల సమక్షంలో ఆ వ్యక్తి హోటల్ గదిలో తలుపు తెరిచి చూడగా.. అందులో వంశీతో పాటు అతని భార్య ఉన్నారు. దీంతో పోలీసులు వంశీతోపాటు ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    ఇక, ఉద్యోగం ఆశ చూపి ఏఆర్ కానిస్టేబుల్ తన భార్యను లోబరుచుకున్నాడని ఆ మహిల భర్త ఆరోపించాడు. పోలీసు శాఖలో పనిచేస్తూ ఇలాంటి పాడుపని చేస్తున్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అతడు డిమాండ్ చేశాడు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Illegal affair

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు