• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HUSBAND BEAT HIS WIFE TO DEATH WITH A HAMMER IN NIZAMABAD VB NZB

Murder: భార్యాభర్తల మధ్య గొడవ.. పుట్టింటి నుంచి భార్యను తీసుకొస్తుండగా మళ్లీ గొడవ.. భార్యను సుత్తితో కొట్టి..

Murder: భార్యాభర్తల మధ్య గొడవ.. పుట్టింటి నుంచి భార్యను తీసుకొస్తుండగా మళ్లీ గొడవ.. భార్యను సుత్తితో కొట్టి..

ప్రతీకాత్మక చిత్రం

Murder: క్ష‌ణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కష్టసుఖాల్లో తోడు ఉండాల్సిన భర్తే ఆమె పాలిట శాపంగా మారాడు. ఇద్దరి మధ్య గొడవలు ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

  • Share this:
    (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

    ఆ దంపతులు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఓ రోజు భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్ని రోజులైనా రాక పోవడంతో భర్త ఆమె ఇంటికి వెళ్లాడు. తనదే తప్పు అయిందని నచ్చజెప్పి తిరిగి తన భార్యతో ఇంటికి బయలుదేరాడు. మధ్యలో వారి కూతురు, అల్లుడు ఉండే ఊరిలో ఒక రోజు ఉండి పోదామని ఆక్కడకు వెళ్లారు. అయితే అక్కడ కూడా మాటల్లో మాట వచ్చి వారిద్దరి మధ్య గొడవ మళ్లీ పెరిగింది. కూతరు, అల్లుడు ఎంత సముదాయించిన వినలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త క్షణికావేశంలో భార్య తలపై సుత్తితో కొట్టాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో అక్కడిక్కడే మరణించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చెరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    నిజామాబాద్ జిల్లా ధ‌ర్ప‌ల్లి మండ‌ల కేంద్రానికి చెందిన గోసంగి కాల‌నీకి చెందిన డొక్క దుర్గ‌య్య కుమారునికి, జగిత్యాల జిల్లా మెట్ పల్లి కి చెందిన చింత్తా మహేష్, నర్సమ్మ దంప‌తుల ఒక్క‌గానొక్క‌ కూతురిని ఇచ్చి వివాహం చేశారు. అయితే మ‌హేష్, న‌ర్స‌మ్మ‌లు తరచూ గొడవ పడేవారు.. దీంతో మూడు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జ‌రిగింది.. అయితే భార్య న‌ర్స‌మ్మ‌ సొంత ఊరైన మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లి పోయింది.. దీంతో భర్త మహేష్ మెదక్ వెళ్లి భార్య నర్సమ్మ‌ను స‌ముదాయించి తిరిగి ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గ‌మ‌ద్య‌లో ధర్పల్లిలో ఉన్న కూతురిని అల్లున్ని క‌లిసి ఒక రోజు ఉండి వెలుదామ‌నుకున్నారు. అయితే ఆ రోజు రాత్రి వారిద్దరి మధ్య మళ్ళీ గొడవ కావడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన మహేష్ తన భార్య న‌ర్స‌మ్మ‌ను సుత్తితో గట్టిగా తలపై మోదాడు.

    దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఒక్కసారిగా భ‌యాందోళ‌న‌కు గురైన కుటుంబ‌స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. విష‌యం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మహేష్ పరారీలో ఉన్నట్లు సిఐ శ్రీశైలం తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు