Home /News /telangana /

HUSBAND ATTACKS WIFE WITH KNIFE AT KODAD DUE TO SUSPICIOUS BEHAVIOR

Husband attack wife : భర్త దారుణం.. అందరి ముందే.. భార్యపై కత్తితో వేటు..

Husband attack wife : భర్త దారుణం..  అందరి ముందే.. భార్యపై కత్తితో వేటు..

Husband attack wife : భర్త దారుణం.. అందరి ముందే.. భార్యపై కత్తితో వేటు..

Husband attack wife : భార్య భర్తల మధ్య అనుమానాలు చివరకు హత్యలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో ఓ భర్త తన భార్యపై అనుమానంతో అందరు చూస్తుండగానే హత్య ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ ఉన్నవారు అడ్డుకోవడంతో ఆమె ప్రాణపాయం నుండి తప్పించుకుంది.

ఇంకా చదవండి ...
    భార్యపై అనుమానతో వేధించిన ఓ భర్త చివరకు ఆమెపై అత్యాహత్యం ( attempt to murder )చేశాడు. అయితే ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలోనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికంగా ఉన్న కొంతమంది అడ్డుకోవడంతో ఆమె గాయాలతో బయటపడింది. వెంటే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సంఘటన సూర్యపేట జిల్లా కోదాడలో చేసుకుంది.

    విజయవాడకు ( vijayawada )చెందిన బజ్జురీ అనిల్‌కు పదేళ్ల క్రితం చిలుకూరు మండలం కట్టకొమ్మ గ్రామానికి చెందిన శ్రీలతతో పెళ్లి జరిగింది. అయితే వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా అనిల్‌కు గత కొద్ది రోజులుగా భార్యపై అనుమానం కల్గింది. దీంతో ఆమెను అనేక సార్లు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అయినా ఆమె భరిస్తూ వస్తోంది. చివరికి భార్యను కడతేర్చాలనే కోపంతో నిత్యం వాగ్వాదానికి దిగుతున్నాడు. దీంతో భర్త పెట్టె టార్చర్ భరించలేఖ శ్రీలత కోదాడలోని కట్టకొమ్ముగూడెంలోని పుట్టింటికి చేరుకుంది.

    ఇది చదవండి : హరిత నిధికి అప్పుడే నిధులు..... విరాళాలు ప్రకటిస్తున్న ప్రజాప్రతినిధులు..


    అయితే శుక్రవారం భార్య కోసం వచ్చిన అనిల్ ఆమెతో అత్తాగారింట్లోనే ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలోనే ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. అనుమానం పెనుభూతంగా మారి హతమార్చేందుకు ప్లాన్ చేశాడు. వాగ్వావాదం జరుగుతుండగానే.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడికి చేరుకుని అనిల్ బంధించారు. అనంతరం చితకబాదారు. గాయపడిన శ్రీలతను స్థానిక కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె భర్త అనిల్‌లు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించారు.

    ఇది చదవండి : కేసీఆర్ బొమ్మతోనే అందరం గెలిచాం.. గెల్లు కూడా అలానే గెలుస్తాడు..


    ఇక హైదరాబాద్‌లో ( Hyderabad ) కురిసిన వర్షానికి మరో ప్రాణం మూసి నదిలో కలిసింది. శుక్రవారం బహిర్భూమి కోసం వెళ్లిన వ్యక్తి మూసి నదిలో కొట్టుకుపోయాడు. చాదర్‌ఘాట్‌ ప్రాంతంలో నివసించే శంకర్ అనే వ్యక్తి బహిర్భూమి కోసం తన కొడుకుతోపాటు మూసి నదీ ప్రాంతానికి వెళ్లాడు. ఈ సమయంలోనే తన మూసి నదిలో కొట్టుకుపోయాడు. దీంతో అక్కడే ఉన్న కొడుకు స్థానికులకు సమాచారం ఇచ్చిన ప్రయోజనం లేక పోయింది. కాగా మృత దేహం కోసం పోలీసులు రెస్కూ ఆపరేషన్ చెపట్టారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Attempt to murder, Crime news, Suryapet

    తదుపరి వార్తలు