నడిరోడ్డుపై దారుణం.. మహిళను పొదల్లోకి లాక్కెళ్లిన వ్యక్తి.. రాళ్లు రువ్వి కాపాడిన స్థానికులు.. అతడెవరని ఆమెను ప్రశ్నిస్తే..

భార్యపై దాడి చేస్తున్న భర్త

నడిరోడ్డుపై ఓ మహిళతో ఓ వ్యక్తి గొడవపడుతున్నాడు. పొదల్లోకి లాక్కెళ్లి పక్కనే ఉన్న బండరాయితో ఆమెను వేసి చంపబోయాడు. స్థానికులు అతడిపైకి రాళ్లు విసిరారు. పోలీసులకు అప్పగించారు. అతడు నీకు ఏమవుతాడు? అని స్థానికులు ప్రశ్నిస్తే..

 • Share this:
  నడిరోడ్డుపై ఓ మహిళతో ఓ వ్యక్తి గొడవపడుతున్నాడు. అంతకంతకు గొడవ పెరుగుతోందే తప్ప అస్సలు తగ్గడం లేదు. అతడు ఆమెపై దాడి చేస్తున్నాడు. కొడుతున్నాడు. చివరకు ఆగ్రహంతో ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి పక్కనే ఉన్న బండరాయితో ఆమెను వేసి చంపబోయాడు. వారి మధ్య జరుగుతున్న గొడవను కొద్దిసేపటి నుంచీ గమనిస్తున్న స్థానికులు అతడేం చేయబోతున్నాడన్నది ముందుగానే గ్రహించారు. వెంటనే అతడిపైకి రాళ్లు విసిరారు. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అతడు నీకు ఏమవుతాడు? అని స్థానికులు ప్రశ్నిస్తే ఆమె చెప్పిన సమాధానం విని కంగుతిన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం టీఎన్‌జీవోస్‌ కాలనీ సమీపంలో బుధవారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుక్కోయలపాడుకు చెందిన జోగి నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంకు చెందిన నవ్యను చాలా కాలం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే నాలుగేళ్లుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ గొడవలు ఇంకాస్త ఎక్కువ అవడంతో నవ్య తన పిల్లలతో కలిసి టీఎన్‌జీవోస్‌ కాలనీలో ఒంటరిగా ఉంటోంది. తనను ఒంటరిని చేసి భార్య జల్సాగా బతుకుతోందని నాగేశ్వరరావు భావించాడు. ఆమె వద్ద తన పిల్లలు ఉండటానికి వీల్లేదనుకున్నాడు.
  ఇది కూడా చదవండి: సెలూన్‌లో పనిచేసే 23 ఏళ్ల కుర్రాడు.. హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్‌ యువతి.. కులం, మతం వేరైనా ఆమె పెళ్లికి సిద్ధపడినా..

  తన పిల్లలను తీసుకుని వచ్చేందుకు బుధవారం వరంగల్ క్రాస్ రోడ్ నుంచి బయలుదేరి భార్యవద్దకు ప్రయాణమయ్యాడు. అయితే టీఎన్‌జీవోస్‌ కాలనీ సమీపంలో రోడ్డుపైనే నవ్య కనిపించింది. దీంతో అక్కడే ఆమెతో నాగేశ్వరరావు గొడవ పడ్డాడు. ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు. నవ్య తలపై బండరాయితో బలంగా మోదాడు. దీన్ని గమనించిన స్థానికులు నాగేశ్వరరావుపై రాళ్లు రువ్వారు. అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: