HUSBAND ATTACK OF HIS WIFE BOY FRIEND IN KAMAREDDY VRY
Kamareddy : నలుగురు పిల్లలు ఉన్నా.... ప్రియుడితో ఉంటానంటూ.. మహిళ ఫిర్యాదు..
ప్రతీకాత్మక చిత్రం
Kamareddy : ఆమెకు నలుగురు పిల్లలున్నారు.. అయినా ప్రియుడి మోజులో పడింది. తాను భర్తను కాదని ప్రియుడితో ఉంటానంటూ మొండికేస్తోంది. ప్రస్తుతానికి ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్లో మకాం వేసింది.
పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా.. మరోవైపు పిల్లలు పుట్టి సాఫిగా సాగుతున్న సంసారాల్లో అక్రమ సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని నెట్టుకురావాల్సిన వారు తమ మధ్య ఉన్న విభేదాలతో ఒకరికొకరు దూరం అవుతున్నారు. ఇలా దూరం కావడమే కాకుండా భార్య భర్తలు ఇద్దరు వేర్వేరు వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకుని తమకు పుట్టిన పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపిస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా అనేక సంఘటనలు వెలుగు చూస్తుండగా తాజగా కామారెడ్డి జిల్లాలో ఓ వివాహిత ఇలాంటి దారుణానికి ఒడిగట్టింది.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాలో ప్రేమ వివాహం తన ప్రియుడి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రియుడే కావాలని మొండికేయడంతో.. ఆవేశంతో ఆమె భర్త ప్రియుడిపై దాడి చేశాడు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం నాగంపల్లి తండాకు చెందిన చందర్‌కు కాస్లాబాద్ తండాకు చెందిన లక్ష్మితో పదిహేనళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే అంతా సాఫిగా కొనసాగుతున్న నేపథ్యంలోనే లక్ష్మి అక్రమ మార్గంలోకి వెళ్లింది. పెళ్లి బంధానికి విలువ లేకుండా చేసి ఆ యువకుడితో లైంగిక సంబధాన్ని కొనసాగించింది.దానికే ప్రేమ అంటూ వెంట తిరిగింది. ఇలా ఇద్దరి ప్రేమాయణం నడుపుతున్న నేపథ్యంలోనే రెగ్యులర్‌గా ఆమె గ్రామానికి వచ్చి కలుస్తున్నాడు. ఇలా కలవడం ఇష్టం లేని లక్ష్మి భర్త, రాందాస్ రావడంతో వారించాడు. గ్రామానికి వచ్చిన రాందాస్‌తో వాగ్వాదానికి దిగి అక్కడి నుండి తరిమేశాడు.
దీంతో లక్ష్మి సైతం రంగంలోకి దిగింది. తాను ఇక భర్త చందర్‌తో కలిసి జీవించలేని తేల్చేసింది. వెంటనే పోలీస్ స్టేసన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమెతో పాటు రాందాస్ కూడా వెళ్లాడు. ఇద్దరు కలిసి జీవిస్తామని పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే రాందాస్ పోలీస్ స్టేషన్ నుండి టిఫిన్ చేసేందుకు బయటకు వచ్చాడు. దీంతో అక్కడే కాపు ఉన్న లక్ష్మి భర్త చందర్ , ప్రియుడు రాందాస్ పై కత్తితో దాడి చేశాడు. కడుపులో మూడు సార్లు పోడిచాడు . దీంతో అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం గాయపడిన రాందాస్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. చందర్‌ను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.