World Egg Day: ఆకలి తీర్చుకునేందుకు గుడ్లను తిన్న కాకి.. 

గుడ్లు తింటున్న కాకి

కూటి కోసం కోటి తిప్పలు అని ఊరికే అనలేదు. ఆకలి, దప్పిక తీర్చుకోవడానికి భూమి మీద ప్రతి జీవరాశి.. వాటికి తోచిన రీతిలో ప్రయత్నాలు చేస్తుంటాయి.

  • Share this:
    కూటి కోసం కోటి తిప్పలు అని ఊరికే అనలేదు. ఆకలి, దప్పిక తీర్చుకోవడానికి భూమి మీద ప్రతి జీవరాశి.. వాటికి తోచిన రీతిలో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ కోవలోనే దాహాం వేసిన కాకి గొంతు తడుపుకునేందుకు కుండలో రాళ్ళు వేసి, అడుగున ఉన్న నీరు పైకి వచ్చిన తర్వాత ఆ నీటిని తాగి తన దప్పిక తీర్చుకున్న కథ అందరికి తెలిసిందే. కానీ ఓ కాకి ఆకలి తీర్చుకోవడానికి ఎం చేసిందే చూస్తే షాకవ్వకుండా ఉండలేరు. దుకాణం ముందు అమ్మకానికి ఉంచిన కోడిగుడ్ల ట్రేను గమనించిన కాని.. అందులోని గుడ్లను పగలగొట్టి అందులోని సోనను తాగింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇ

    వివరాలు.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ దుకాణం వద్ద అమ్మకానికి బయట ఉంచిన కోడిగుడ్ల ట్రే లో గుడ్లను గమనించిన ఓ కాకి తన ఆకలి తీర్చుకోవడం కోసం అటూ ఇటూ వాలుతూ సరిగ్గా ఆ గుడ్ల ట్రే పైకి వచ్చి వాలింది. ముందుకు వెనుకకు కదులుతూ తనను ఎవరైనా గమనిస్తున్నారా లేదా అని అటూ ఇటూ చూసుకుంది. ఆ తర్వాత ముక్కు తో గుడ్లను పోడిచి అందులోని సొనను తిని ఆకలి తీర్చుకుంది. ఇలా సుమారు ఏడు ఎనిమిది గుడ్లను పగులగొట్టింది. కాకి ఆకలి తీర్చుకుంటున్న తీరును గమనించి ఆ గుడ్ల వ్యాపారి దాన్ని ఏమనకుండా అలాగే మిన్నకుండిపోయాడు. కొద్దిసేపు అక్కడ తన ఆకలిని తీర్చుకునేందుకు ఆ కాకి చేసిన సందడితో స్థానికులు కూడా విస్మయం చెందారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు.

    ఇక, కోడి గుడ్లలో పోషకాలు ఉన్నాయన్న సంగతి కాకి కూడా తెలిసిపోయినట్లు ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అన్నట్లు శుక్రవారం వరల్డ్ ఎగ్ డే. గుడ్డులో ఉన్న పోషకాలు, వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఈ గుడ్డు దినోత్సవం జరుపుకుంటున్నారు. కాకి స్పూర్తితోనైనా అపోహలు వీడి ప్రజలు కోడి గుడ్లను తిని తమ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను పొందుతారని ఆశిద్దాం.
    Published by:Sumanth Kanukula
    First published: