Revanth reddy : సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి.. దండోరాలో లక్షకు ఒక్కరు తక్కువైన..సీఎంకు గులాంగిరి చేస్తా...!

కేసీఆర్, రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో0

Revanth reddy : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత గిరిజన దండోరాను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఆగస్టు 9న ఇంద్రవెళ్లిలో నిర్వహించే దండోరాకు బారీ ఎత్తున ప్రజలను పోగు చేసేందుకు ఆపార్టీ కసరత్తు చేస్తోంది.. ఇందులో భాగాంగా పార్టీ అధ్యక్షడు దండోరాలో లక్షమందికి ఒక్కరు తక్కువైనా..సీఎం కేసీఆర్ క గులాంగిరి చేస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు..

  • Share this:
    దళితులతోపాటు గిరిజనులకు కూడా రూ.10లక్షలు ప్రకటించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేస్తూ.. . ఈనెల 9న ఇంద్రవెల్లిలో జరగబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను నిర్వహించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలోనే సన్నాహాక కార్యక్రమాల్లో భాగంగా వాల్‌పోస్టర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఇక ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17వరకు జరిగే దళిత, గిరిజన దండోరా కార్యక్రమాల్లో ఒక రోజు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొంటారని ఆయన తెలిపారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వ అటవి అధికారులు చిత్రహింసలకు గురిచేస్తూ.. చెట్లకు కట్టేసి కొడుతుంటే సీఎం కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

    ఈ క్రమంలోనే కొమరంభీమ్‌ స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఇంద్రవెళ్లిలో జరిగే సభకు ఎన్ని నిర్బంధాలు విధించినా లక్ష మందితో ఇంద్రవెల్లిలో సభ పెట్టి తీరుతామని స్పష్టం చేశారు. లక్షకు ఒక్కరు తక్కువైనా.. సీఎం కేసీఆర్‌కు గులాంగిరి చేస్తామని సవాల్‌ విసిరారు. గిరిజనులు అమాయకులే అయినా.. ఆలోచన లేనివారు కాదని, గిరిజనుల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపించారు.

    హుజూరాబాద్‌ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్‌ ఇంటికి రూ.10లక్షలు ప్రకటించారని ధ్వజమెత్తారు. రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తారో ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు. ఏడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.15లక్షల కోట్లు ఖర్చు చేస్తే... అందులో గిరిజనులకు కోసం ఖర్చు పెట్టింది ఎంత అంటూ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

    అయితే సభలకు వెళుతున్న వారిని కరోనా నిబంధనలో రాష్ట్ర పోలీసులు పార్టీ నాయకులను కార్యకర్తలను నిర్బంధంలో ఉంచుతోంది.. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలను తరలించి మరోసారి పార్టీకి పునర్‌వైభవం తీసుకురావాలని భావిస్తోంది.. అయితే పోలీసులు ఎలాంటీ అడ్డంకులు లేకుండా ఉంటే అధిక ప్రజలను మీటింగ్‌కు తరలించేందుకు పార్టీ శ్రేణులు  సన్నద్దతమవుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published: