కరోనా ధర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జ్వర సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం నుండి ప్రారంభమైన ఈ సర్వే దాదాపు ఆరు రోజుల పాటు కొనసాగనుంది. కాగా శుక్రవారం చేపట్టిన ఒక్క రోజు జ్వర సర్వేలో షాకింగ్ నిజాలు వెలువడ్డాయి.. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు నాలుగు నుండి ఐదు వేల మధ్య రికార్డు అవుతుంటే జ్వర సర్వేలో మాత్రం ఏకంగా 45 వేల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారందరికి కరోనా చికిత్సకు కావల్సిన హోం ఐసోలేషన్ కిట్స్ అందించారు. ఈ సర్వే సంధర్భంగా చిన్న పిల్లలతో పాటు పెద్దవారి గల లక్షణాలు సేకరిస్తున్నారు. కాగా పెద్ద పెద్దమొత్తంలో పెద్దవారికే ఈ లక్షణాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక కోవిడ్ లక్షణాలు సీవియర్ గా ఉన్న వారిని ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. మరి ఇబ్బందిగా ఉన్న తరుణంలో ఆసుపత్రులకు సైతం రిఫర్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయ.
ఇక తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే నాలుగు వేల 416 కరోనా పాజీటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Hyderabad : కోతుల నియంత్రణపై సమీక్ష.. రాష్ట్రంలో ఆరులక్షల కోతులు... వాటిని ఏం చేద్దాం...?
సర్వేలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సిబ్బంది తో కలిసి సిద్దిపేట లో పాల్గొన్నారు.. ప్రతి ఒక్కరికి టీకాలు పడ్డాయా ఎలాంటీ లక్షణాలు ఉన్నాయి.. టీకా వేసుకోకపోతే వెంటనే టీకా వేయించే విధంగా మోటివేట్ చేశారు.. పట్టణంలో పలు ప్రాంతాలు తిరుగుతు జ్వర సర్వేలో పాల్గొనే విధంగా చర్యలు చేపట్టారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో కూడా మంత్రులు , ఎమ్మెల్యేలు ఇంటింటి జ్వర సర్వేలో పాల్గొని ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు. కాగా ఇప్పటిక ే కరోనా ఉధృతి పెరుగుతుండడంతో ప్రజలు సైతం బయట రాకుండా పలు జాగ్రత్తలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.