హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆదాయ కిక్కు కోసం.. బార్లకు భారీగా దరఖాస్తులు.. ఎక్సైజ్ శాఖకు డబ్బులే డబ్బులు..

ఆదాయ కిక్కు కోసం.. బార్లకు భారీగా దరఖాస్తులు.. ఎక్సైజ్ శాఖకు డబ్బులే డబ్బులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొత్తగా బార్లను ఏర్పాటు చేయడానికి ఔత్సాహికులు అత్యంత  ఆసక్తి చూపుతున్నారు. అయితే నిజామాబాద్ కన్నా కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో మద్యం వ్యాపారంలోకి రావాడానికి భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు.

  • News18
  • Last Updated :

తెలంగాణలో ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువగా వచ్చే రంగాలలో ఎక్సైజ్ శాఖ ఒకటి. ఏ రంగం నుంచైనా ఆదాయం అటూ ఇటూ తేడాగా వచ్చినా.. ఎక్సైజ్ శాఖ మాత్రం ఆదాయాన్ని పెంచుకుంటుందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే బార్ల కోసం అవకాశవాదులు భారీ స్థాయిలో దరఖాస్తులు చేస్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొత్తగా బార్లను ఏర్పాటు చేయడానికి ఔత్సాహికులు అత్యంత  ఆసక్తి చూపుతున్నారు. అయితే నిజామాబాద్ కన్నా కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో మద్యం వ్యాపారంలోకి రావాడానికి భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 బార్లకు 212 దరఖాస్తులు రాగా.. ఒక్కో దరఖాస్తుకు లక్ష రూపాయల చొప్పున 212 ధరఖాస్తులకు రూ. 2.12 కోట్ల ఆదాయం లభించడం విశేషం. జనవరి 25 న నిజామాబాద్ జిల్లాలో 12 కొత్త బార్లకు, కామారెడ్డిలో 4 బార్ల పర్మిషన్ కు నోటిఫికేషన్ జారీ చేశారు. నిజామాబాద్, నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 07 బార్లకు 10 దరఖాస్తులు రాగా, బోదన్ లో 3 కు గాను 3, ఆర్మూర్ లో 1 కి గాను 10, భీంగల్ లో ఒక్క బార్ కు 36 దరాఖాస్తులు వచ్చాయి.

కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి పట్టణంలో 1 బార్ కోసం 50 దరాఖాస్తులు, బాన్సువాడలో 2 కుగాను 62, ఎల్లారెడ్డి లో 1 కి గాను 47 దరాఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ తెలిపారు. ఈ నెల 10న నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్ లలో లక్కి డ్రా ద్వారా బార్ లను కేటాయించనున్నారు. ఈసారి ఎక్సైజ్ ట్యాక్స్ ను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోదన్, ఆర్మూర్, కామారెడ్డి, భాన్సువాడ మున్సిపాల్టీల పరిధిలో రూ. 42 లక్షలు, ఎల్లారెడ్డి, బీంగల్ మున్సిపాల్టీలో రూ. 30 లక్షలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయినా అవకాశవాదులు మాత్రం ఎగబడి దరాఖాస్తులను దాఖలు చేయడం గమనార్హం.

First published:

Tags: Kamareddy, Liquor, Liquor sales, Liquor shops, Nizamabad, Telangana

ఉత్తమ కథలు