Ration Card Status: తెలంగాణలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా?.. అయితే అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    ‌కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో ఇదివరకే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తులను అధికారులు ఆమోదించారో, లేదో అనే సందేహంలో ఉన్నారు. ఆ విషయాలు ఎలా తెలసుకోవాలో చాలా మందికి తెలియడం లేదు.

    అయితే మీ సేవకు వెళ్లి దరఖాస్తు అప్రూవ్ అయిందా లేదా అని దరఖాస్తు దారులు తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఇంట్లోనే ఉండే రేషన్ కార్డు ఆప్లికేషన్ స్టేషన్‌ను తెలసుకోవచ్చు. ఇందుకోసం మీరు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

    1. https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో FSC Search అనే ఆప్షన్ కనిపిస్తుంది.
    2. దానిపైన క్లిక్ చేయగానే.. Ration Card Search కింద FSc Search, FSC Application Search అనే రెండు ఆప్షన్స్ వస్తాయి.
    3. ఇప్పుడు FSC Application Search అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
    4. ఆ తర్వాత సెలక్ట్ డిస్ట్రిక్ట్, సెర్చ్ బై అనే రెండు బాక్స్‌లు కనిపిస్తాయి. సెలక్ట్ డిస్ట్రిక్ట్ వద్ద మీ జిల్లాను ఎంచుకోవాలి. అలాగే సెర్చ్ బై వద్ద.. మీ సేవ నెంబర్ (లేదా) మొబైల్ నెంబర్ (లేదా) అప్లికేషన్ నెంబర్ ఏదైనా ఒకటి(మన వద్ద ఉన్న వివరాల ప్రకారం) ఎంచుకోని.. ఆ వివరాలు ఎంటర్ చేయాలి.
    5. ఆ తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేస్తే.. మీ రేషన్ కార్డు దరఖాస్తును ఆమోదించారో లేదా అనేది మీకు తెలుస్తుంది.
    Published by:Sumanth Kanukula
    First published: