తెలంగాణ మునుగోడు బైపోల్ (Munugodu By poll) హీట్ మామూలుగా లేదు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఉపఎన్నికను మరింత రసవత్తరంగా మార్చాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నామినేషన్లు సమర్పించారు. అలాగే మునుగోడు (Munugodu) బరిలో ఇతర పార్టీల అభ్యర్థులు,, ఉద్యమకారులు, కళాకారులూ నామినేషన్ వేశారు. నేటితో మునుగోడు బైపోల్ (Munugodu By poll) లో నామినేషన్ ఉపసంహరణ ఘట్టం ముగిసింది.
మునుగోడు బైపోల్ (Munugodu By poll) లో మొత్తం 130 మంది నామినేషన్లు దాఖలు చేయగా..83 సరైనవి కావని అధికారులు తేల్చారు. ఈ 83 నామినేషన్లలో 36 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది.. దీనితో మునుగోడు (Munugodu) బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. ఇందులో ప్రధానంగా మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy), కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి (Sravanthi), టీఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Koosukuntla prabhakar reddy) ఉన్నారు. అలాగే బీఎస్పీ, తెలంగాణ జన సమితి, ప్రజాశాంతి పార్టీతో పాటు మరికొంతమంది బరిలో నిలిచారు. మునుగోడు బైపోల్ కు నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా..6న కౌంటింగ్ జరగనుంది.
Breaking News: టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ బిగ్ షాక్..రూ. 80.65 కోట్ల ఆస్తులు అటాచ్
తెలంగాణలో నిర్వహించబోయే మునుగోడు (Munugodu) ఉపఎన్నికను ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బరిలో దిగుతుండగా..కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పోటీలో నిలిచారు. ఇక తెలంగాణలో అధికార పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
Manchu Vishnu: మా నాన్నలో నాకదే నచ్చదు.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్
కాగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డిపై (Komatireddy Rajagopal Reddy) వరుస విమర్శలు వస్తున్నాయి. కేవలం కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కన్న తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వీడారని ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. రూ.18 వేల కోట్ల కోసం రాజగోపాల్ (Komatireddy Rajagopal Reddy) బీజేపీలో (Bjp) చేరారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇక మునుగోడులో (Munugodu) గెలిచి రాష్ట్రంలోనూ పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతుంది. ఇక కాంగ్రెస్, బీజేపీని చిత్తుగా ఓడించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది. మరి మునుగోడు (Munugodu) నియోజవర్గ ఓటరు నాడి ఎలా ఉందో ఫలితాల తర్వాత తెలియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugodu By Election, Telangana