Home /News /telangana /

HOW MANY PEOPLE FROM TELANGANA WORKING IN ARMY AND WHY THE VIOLENCE IN SECUNDERABAD AK BK

తెలంగాణ నుంచి ఆర్మీలో ఎంత మంది ఉన్నారో తెలుసా..? అయినా దేశంలో ఎక్క‌డ జ‌ర‌గ‌ని విధంగా ఇక్క‌డే అల్ల‌ర్లు ఎందుకు ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ భారత రాష్ట్రాలలో, ఇతర ఐదు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచి ఆర్మీలో చేరిన యువ‌కులు చాలా త‌క్కువ‌గా ఉన్నార‌నే చెప్పుకోవాలి.

  Balakrishna, Correspondent, News18

  సికింద్ర‌బాద్‌ రైల్వేస్టేషన్‌లో మొన్న జ‌రిగిన అల్ల‌ర్లు రాజకీయ రంగు పులుముకున్నాయి. అస‌లు తెలంగాణ‌లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌ధ్ కు ఎందుకు అంత వ్య‌తిరేక‌త వ‌చ్చిందో న్యూస్ 18 తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసింది. తెలంగాణ నుంచి ఏటా ఆర్మీకి సెలెక్ట్ అయ్యే యువ‌కులు ఎంత మంది ? అస‌లు అల్ల‌ర్లు వెనుక అస‌లు కార‌ణాలేంటీ ? అనే అంశాలు చూద్దాం. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో(Army Recruitement) తెలంగాణ అగ్రగామి రాష్ట్రం కానప్పటికీ, జూన్ 17న కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్(Agnipath) రిక్రూట్‌మెంట్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో విస్తృత నిరసనలు జరిగాయి. తెలంగాణ‌లో(Telangana) ఎప్పుడు లేని విధంగా ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కూడా చెల‌రేగ‌ని ఈ స్థాయిలో అల్ల‌ర్లు మొన్న జ‌రిగాయి. అయితే  ఆర్మీ రిక్రూట్‌మెంట్ జాబితాలో తెలంగాణ 20వ స్థానంలో ఉంది. 15 మార్చి 2021న రాజ్యసభలో రక్షణ మంత్రిత్వ శాఖ(Defence Ministry) విడుదల చేసిన డేటా ప్రకారం.. తెలంగాణ నుండి మొత్తం 10,970 మంది ఇండియ‌న్ ఆర్మీలో ప‌ని చేస్తోన్నారు. ఇదిలా ఉంటే ప‌క్క రాష్ట్ర‌మైన ఏపీ 44,123 మంది ఆర్మీ ఉద్యోగుల‌తో 11వ స్థానంలో ఉంది.

  ఆర్మీ రిక్రూట్‌మెంట్ జాబితాల ఉత్తరప్రదేశ్, పంజాబ్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఆర్మీలో పనిచేస్తున్న 11,21,489 మందిలో 1,67,557 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కాగా, 89,088 మంది పంజాబ్‌కు చెందిన వారు ఉండ‌డం విశేషం. మహారాష్ట్ర నుంచి 87,835 మంది, రాజస్థాన్‌ నుంచి 79,481 మంది, బీహార్‌ నుంచి 75,026 మంది ఆర్మీలో త‌మ సేవాలు అందిస్తోన్నారు.

  ఆసక్తికరమైన విషయమేమిటంటే, దక్షిణ భారత రాష్ట్రాలలో, ఇతర ఐదు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచి ఆర్మీలో చేరిన యువ‌కులు చాలా త‌క్కువ‌గా ఉన్నార‌నే చెప్పుకోవాలి. కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన డేటా ప్ర‌కారం ఇంత త‌క్కువ మంది యువ‌కులు ఆర్మీ లో ఉన్న‌ప్ప‌టికి  చేరుతున్న‌ప్ప‌టికి ఈ స్థాయిలో ఇక్క‌డ అల్ల‌ర్లు జ‌ర‌గ‌డం వెనుక రాజ‌కీయ హ‌స్తం ఉంద‌నే వాద‌న‌లు బ‌ల‌ప‌డుతున్నాయి. ఇదిలా ఉంటే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో 52,667 మంది సిబ్బందితో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా, 44,123 మందితో ఆంధ్రప్రదేశ్, 38,927 మంది సిబ్బందితో కేరళ రెండో స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో 32,634 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు.  డేటా ప్ర‌కారం కేరళలోని రెండు ప్రదేశాలు - కోజికోడ్, తిరువనంతపురం, కర్ణాటకలోని బెలగావిలో కూడా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. కానీ తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగినంత భారీ, హింసాత్మక నిరసనలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్క‌డ జ‌ర‌గ‌లేదు. తెలంగాణ లో జ‌రిగిన హింస‌లో నిరసనకారుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, కొందరు గాయపడ్డారు,  దక్షిణ మధ్య రైల్వేకు చెందిన దాదాపు 3 కోట్ల విలువైన ఆస్తి కి నష్టం జరిగింది.

  అస‌లు సికింద్రాబాద్‌లో హింస ఎలా జ‌రిగింది?
  తెలంగాణలోని పలు జిల్లాల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు జూన్ 16 సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. జూన్ 14న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను ప్రకటించిన తర్వాత వారు త‌మ నిర‌స‌న‌కు సంబంధించిన వ్యూహాన్ని సిద్దం చేసుకున్నారు.  నిరసనకారులు కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లుగా నిర్వహించని ఆర్మీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEE) అభ్యర్థులుగా చెప్ప‌త్తున్న‌ప్ప‌టికి వారిలో చాలా మంది అల్ల‌రి మూక‌లే ఉన్నార‌ని రైల్వే పోలీసుల స‌మాచారం.

  Agnipath Protest: సికింద్రాబాద్​ అగ్నిపథ్​ అల్లర్ల వెనుక పీకే ? TRS​పై బీజేపీ ఎదురుదాడి..

  Secunderabad: అంతా అతని పనే.. సికింద్రాబాద్ విధ్వంసంలో ప్రధాన సూత్రధారి అరెస్ట్

  నిర‌స‌న‌కు రెండు రోజుల ముందు నుంచే వాట్సప్ అండ్ టెలిగ్రామ్‌లోని వివిధ గ్రూపుల ద్వారా ఈ అల్ల‌ర్లు ప్లాన్ చేసిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా అల్ల‌ర్లుకు ఒక రోజు ముందుగానే నగరానికి చేరుకొని వారి స్నేహితుల బంధువుల ఇళ్లలో రాత్రి బస చేసినట్లు పోలీసుల వ‌ద్ద స‌మాచారం ఉంది. ప్ర‌స్తుతం తెలంగాణ లో జ‌రిగిని హింసపై కేంద్ర ప్ర‌భుత్వం ఆరా తీస్తోంది. దీని వెనుక ఎవ‌రు ఉన్నారు అనేదానిపై ఆరా తీయ‌డమే కాకుండా ప‌లు డిపెన్స్ కొచింగ్ సెంట‌ర్స్ అధినేత‌ల‌ను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Agnipath Scheme, Army, Secunderabad railway station, Telangana

  తదుపరి వార్తలు