హోమ్ /వార్తలు /తెలంగాణ /

Schools Reopen: పిల్లలను స్కూళ్లకు పంపుతారా? పేరెంట్స్ ఏమంటున్నారు? సర్వేలో షాకింగ్ విషయాలు

Schools Reopen: పిల్లలను స్కూళ్లకు పంపుతారా? పేరెంట్స్ ఏమంటున్నారు? సర్వేలో షాకింగ్ విషయాలు

Telangana Schools Reopening: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట 8 నుంచి 10వ తరగతులకు స్కూళ్లలో క్లాసులు మొదలుపెట్టడంతో పాటు 1 నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఆన్​లైన్ క్లాసులను నిర్వహించాలనుకుంటోంది

ఇంకా చదవండి ...

కరోనావైరస్ నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో త్వరలోనే బడి గంటలు మోగనున్నాయి. అయితే వైరస్ పరిస్థితుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపాలా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు నిర్వహించాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొందరు తల్లిదండ్రులు మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో 55 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే ఇప్పటికిప్పుడు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సుముఖంగా ఉన్నట్టు తేలింది.

క్రమంగా కరోనా ప్రభావం తగ్గుతుండడంతో పిల్లలను స్కూళ్లకు పంపాలని నిర్ణయించుకుంటున్న తల్లిదండ్రులు సంఖ్య ఎక్కువవుతున్నారని సర్వే తెలుపగా.. మరికొందరు ఇంకా విముఖంగానే ఉన్నారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా కూడా గణాంకాలను సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా జూన్​లో 76 శాతం మంది పేరెంట్స్ తమ పిల్లలను పిల్లలను పాఠశాలలకు పంపకూడదని అనుకుంటే.. జులైకి 48 శాతానికి తగ్గింది. అదే ఆగస్టు విషయానికి వస్తే 44 శాతానికి చేరిందని సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే వానలు.. ఈ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

ఇప్పటికిప్పుడు స్కూళ్లు తెరవడానికి తెలంగాణలోని 42శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉంటే.. 55 శాతం మంది సమర్థిస్తున్నారు. మరో 3 శాతం మంది తటస్థంగా ఉన్నారు. స్కూళ్లు తెరిచే నిర్ణయానికి సుముఖంగా ఉన్న వారిలో 8.8 శాతం మంది ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని కోరితే.. 23 శాతం మంది సెప్టెంబర్ 1 నుంచి మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. మరో 24 శాతం మంది సెప్టెంబర్ 15 తర్వాత ఆఫ్​లైన్ క్లాసులు నిర్వహిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. మరో మూడు శాతం మంది ఏమీ చెప్పలేమని వెల్లడించారు.

మొత్తంగా 10వేల స్పందనలను (తెలంగాణను నుంచి 2,077) పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే వివరాలను వెల్లడించింది. ఇందుకోసం మొత్తం 40వేల మందిని సర్వే చేసింది. స్కూళ్లు తెరిచినా అధికార యంత్రాంగం పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూళ్లలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి టీచర్లకు, సిబ్బందికి టీకాలు వేయించాలని 83శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు అంటుంటే.. రాపిడ్ యాంటి జెన్ టెస్టులు అందరికీ చేయించాలని 67 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట 8 నుంచి 10వ తరగతులకు స్కూళ్లలో క్లాసులు మొదలుపెట్టడంతో పాటు 1 నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఆన్​లైన్ క్లాసులను నిర్వహించాలనుకుంటోంది. ఆంధ్రప్రదేశ్​లో పాఠశాలలు ప్రారంభం కాగా.. దేశంలోని మరిన్ని రాష్ట్రాల్లోనూ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.

First published:

Tags: Coronavirus, Schools reopening, Telangana, Telangana schools

ఉత్తమ కథలు