Home /News /telangana /

HOW ENTRANCE EXAMS WILL BE HELD IF LOCKDOWN IMPOSED HIGH COURT QUESTIONS TELANGANA GOVERNMENT AK

లాక్‌డౌన్ పెడితే ఆ పరీక్షలు ఎలా.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంట్రెన్స్ పరీక్షల వాయిదా అవకాశాలపై అధికారులతో సీఎస్ చర్చిస్తారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు.

    హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పెడితే ఎంట్రెన్స్ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో రెండు వారాలపాటు లాక్‌డౌన్ పెట్టే యోచనలో ఉన్నట్టు వార్తలు రావడంతో... ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పెడితే ఎంట్రెన్స్ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే లాక్‌డౌన్ ఉంటుందా లేదా అన్నది కేబినెట్ నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపిన ఏజీ(అడ్వకేట్ జనరల్) హైకోర్టుకు తెలిపారు.

    ఒకటి, రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రవేశ పరీక్షల వాయిదాపై మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్ణయం చెబుతామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎంట్రన్స్ పరీక్షల వాయిదా అవకాశాలపై అధికారులతో సీఎస్ చర్చిస్తారని ఏపీ కోర్టుకు వివరించారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా వేసింది.

    ఇదిలా ఉంటే షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో జూలై 6 నుంచి 9వ తేదీవరకు ఎంసెట్- 2020 పరీక్ష జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం జూలై 6, 7, 8 తేదీలలో ఇంజినీరింగ్ విభాగం, జూలై 8, 9 తేదీలలో అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తే.. ఎంసెట్ పరీక్ష నిర్వహణ ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.




    First published:

    Tags: Exams, Telangana, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు