ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ భయపడ్డారా... వ్యూహాత్మకంగా వ్యవహరించారా?

కేసీఆర్, ఆర్టీసీ

Telangana : హుజూర్‌నగర్‌లో వచ్చిన భారీ మెజార్టీ... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి కొండంత బలం ఇచ్చింది. దాని ప్రభావం ఆర్టీసీ కార్మికులపై గట్టిగానే పడింది.

 • Share this:
  Telangana : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ తెచ్చింది. అది ఎంతలా అంటే... ఆర్టీసీ సమ్మె చేస్తున్న యూనియన్లను సీఎం కేసీఆర్ ఉతికారేసేంతలా. నిజానికి ఈ సమ్మె మూడు వారాలుగా చేస్తున్నా... కేసీఆర్ ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టలేదు. సమ్మెపై తన అభిప్రాయాన్ని ప్రజల ముందుకు తేలేదు. దీనికి ప్రధాన కారణం హుజూర్‌నగర్ ఉప ఎన్నిక. ముందే ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయం చెప్పి ఉంటే... దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఒకవేళ ప్రజలు నెగెటివ్‌‌గా రిసీవ్ చేసుకుంటే... దాని ప్రభావం హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై పడే ప్రమాదం ఉందని గ్రహించిన టీఆర్ఎస్ అధినేత... వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎప్పుడైతే ఫలితం టీఆర్ఎస్‌కి అనుకూలంగా రావడమే కాక... భారీ మెజార్టీ (43వేలకు పైగా ఓట్ల మెజార్టీ) దక్కడంతో... గులాబీ బాస్‌కి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇక తాను చెప్పిందే వేదం... చేసేదే శాసనమని భావించిన కేసీఆర్... ప్రెస్‌మీట్ పెట్టి తన మనసులో ఉన్నదంతా బయటకు చెప్పేశారు. ఆర్టీసీ కార్మికులు అమాయకులు అంటూనే... సమ్మె చేస్తున్న యూనియన్లపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఒకవేళ హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవకపోయి ఉంటే... ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ కొంత రాజీ పడే వారేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

  హుజూర్‌నగర్ ఉప ఎన్నిక గెలుపు... ప్రతిపక్షాలకు కూడా పెద్ద షాకే. ఇప్పటివరకూ సీఎం కేసీఆర్‌ను ప్రతిపక్షాలు నానా మాటలయ్యాయి. నియంత అనీ, ప్రగతి భవన్‌లోనే ఉంటారనీ, రాష్ట్రాన్ని అప్పుల్లో పడేశారనీ, సెక్రటేరియట్ నిర్మాణం పేరుతో డబ్బులు వేస్ట్ చేస్తున్నారనీ... ఇలా ఎన్నో రకాలుగా ఎడా పెడా తిట్టిపోశాయి. ఇప్పుడు హుజూర్‌నగర్‌ (కాంగ్రెస్ కంచుకోట)లో స్వయంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమారే తన భార్యను గెలిపించుకోలేకపోవడం, బీజేపీకి డిపాజిట్ దక్కకపోవడంతో... ఇక ఇప్పుడు టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా మరోసారి తనను తాను నిరూపించుకున్నట్లైంది.

  పాలనకు గెలుపే ప్రాతిపదికా? : నిజానికి హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలిచినంతమాత్రాన... తెలంగాణలో ఆ పార్టీ పరిపాలన అద్భుతంగా ఉందని కాదు. ఆర్టీసీ కార్మికులకు ప్రజల మద్దతు లేదని కూడా కాదు. ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాదే అయ్యింది. మరో నాలుగేళ్లు ఆ పార్టీయే అధికారంలో ఉంటుంది కాబట్టి... హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, దానికి నిధులు రావాలన్నా... అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తే మంచిదని ప్రజలు భావించారనీ, అందుకే అందరూ కలిసి... టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డినే గెలిపించుకున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఐతే... ఒక్కసారి రణరంగంలో దిగాక... గెలిచిన వాళ్లు చెప్పిందే శాసనం అవుతుంది కాబట్టి... ఇప్పుడు ప్రతిపక్షాలు ఎన్ని మాటలన్నా, ఎలా సర్దిచెప్పుకున్నా... టీఆర్ఎస్ గెలుపు గెలుపే. కాబట్టి... ఇది ఆ పార్టీకి ప్లస్ పాయింటే కాదు... ఆర్టీసీ సమ్మె చేస్తున్న యూనియన్లకు గట్టి దెబ్బే అనుకోవచ్చు.

  సమ్మె మానుకోవడమే బెటరా? : ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం ఆర్టీసీ అంతమే అని సీఎం కేసీఆర్ క్లియర్‌గా చెప్పేశారు కాబట్టి... ఇక ఆర్టీసీ యూనియన్లు చేయగలిగేదేమీ లేనట్లే. హుజూర్‌నగర్ గెలుపు కారణంగా... ప్రజలు తమతోనే ఉన్నారంటున్న కేసీఆర్... ఇక ఏమాత్రం ఈ విషయంలో రాజీ పడటమూ, వెనక్కి తగ్గడం వంటివి ఉండవన్నది సుస్పష్టం. అందువల్ల ఇప్పుడు తేల్చుకోవాల్సింది సమ్మె చేస్తున్న యూనియన్లూ, కార్మికులే. ఇప్పటికీ కార్మికులను వెనక్కి వచ్చేయమని సీఎం కేసీఆర్ పిలుపు ఇవ్వడం... వారికి ఓ ఛాన్స్ ఇచ్చినట్లే అంటున్నారు విశ్లేషకులు. గెలుపు ధీమాతో... రెట్టింపు పంతానికి వెళ్తున్న ప్రభుత్వంతో పోరు వల్ల అంతిమంగా ఆర్టీసీ యూనియన్ల సభ్యులు, కార్మికులే నష్టపోయే ప్రమాదం ఉందనే సంకేతాలొస్తున్నాయి.

   

  Pics : అమ్మో... అనైకా సోతీ... అందాల చిత్రవధే...
  ఇవి కూడా చదవండి :

  Health Tips : పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

  Diwali 2019 : దీపావళికి ఈజీగా రంగోలీ వెయ్యడం ఎలా?


  Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి

  Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.

  Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు
  First published: