Home /News /telangana /

HOUSE MOTION PETITION WAS FILED ON AMBULANCE ISSUE IN TELANGANA HIGH COURT VRY

Lockdown : సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై కోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్

తెలంగాణ హైకోర్టు(ఫైల్‌ ఫొటో)

తెలంగాణ హైకోర్టు(ఫైల్‌ ఫొటో)

Lockdown : తెలంగాణ సరిహద్దుల వద్ద పొరుగు రాష్ట్రాల అంబులెన్స్‌లను ఆపడంపై హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్ ధాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వెంకటకృష్ణారావు ఈ పిటిషన్ ఫైల్ చేశారు. అయితే కోర్టు ఈ పిటిషన్‌ను మరికాసేపట్లో విచారించనుంది.

ఇంకా చదవండి ...
లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లో కఠిన నిబంధనలు పోలీసులు అమలు చేస్తున్నారు. పాసులు లేకుండా..రాష్ట్రంలోకి వస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు. అంబులెన్స్‌లను సైతం వెనక్కి పంపించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కర్నూలులోని పుల్లూరు, రామపురం చెక్ పోస్ట్‌తో పాటు ఏపితో పాటు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వెహికిల్స్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా..పలు జిల్లాల్లోని సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు పలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

కాగా తెలంగాణ ఆసుపత్రులకు వచ్చే వారికి ఇక్కడి ఆసుపత్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆసుపత్రుల్లో చికిత్స చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆసుపత్రుల నుండి అనుమతి లేఖను తీసుకోవాలని కొత్త గైడ్‌లైన్స్ తీసుకువచ్చింది. అనంతరం పోలీసు శాఖకు వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలని అప్పుడే తెలంగాణలోకి వాహానాలు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే నిన్నటి వరకు అంబులెన్స్‌లను అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం నేడు మాత్రం వాటిని అడ్డుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నుండి ఇచ్చిన సమాధానం ప్రకారం గురువారం ఒక్క రోజే ఇతర ప్రాంతాల నుండి 500 అంబులెన్స్‌లు వచ్చాయని చెప్పారు. ఇక హైదరాబాద్‌కు చేరుకున్న వారు సైతం అక్కడ బెడ్స్ లేక అంబులెన్స్‌లోనే 50 మంది చనిపోయినట్టు తెలిపారు. హైదరాబాద్‌లో సరైన బెడ్స్ లేవని చెప్పారు. బెడ్స్ ఉన్నప్పుడు అనుమతులు ఇస్తామని తెలంగాణ అధికారులు వివరిస్తున్నారు.

కాగా కోర్టుకూడ అంబులెన్స్‌లు అపడంపై రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయింది. దీంతో వాటిని అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో మరోసారి వివాస్పదమైంది. మరి కోర్టు ఎలాంటీ నిర్ణయాన్ని వెలువరిస్తుందో వేచి చూడాలి.
Published by:yveerash yveerash
First published:

Tags: Karnool, Lock down, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు