Hyderabad Rains: అదృష్టం అంటే ఆమెదే, మృత్యువు దగ్గరకు వచ్చి వెళ్లింది

‘ఆమెకింకా భూమిపై నూకలున్నాయి కాబట్టీ సరిపోయింది. లేకపోతే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.’ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

news18-telugu
Updated: October 14, 2020, 10:36 PM IST
Hyderabad Rains: అదృష్టం అంటే ఆమెదే, మృత్యువు దగ్గరకు వచ్చి వెళ్లింది
రోడ్డు మీద వెళ్తున్న మహిళ, పక్కన కూలిన గోడ
  • Share this:
భారీ వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోతోంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అయిపోయింది. అయితే, ఈ వర్షాలు కొందరి ప్రాణాలు కూడా తీశాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే 15 మంది వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు ఏఎన్ఐ వార్తా సస్థ తెలిపింది. అయితే, ఇంకా ఎందరి ప్రాణం తీస్తుందో అనే ఆందోళన నెలకొంది. అయితే, ఓ మహిళ మాత్రం మృత్యువు అంచుల వరకు వెళ్లివచ్చింది. రోడ్డు మీద మామూలుగా నడుస్తున్న ఆ మహిళ మీద ఓ పెద్ద గోడ కూలిపడపోయింది. వెంటనే ఆమె అప్రమత్తం అయ్యి, పక్కు పరుగు తీయడంతో ప్రాణాలతో బయపటడింది. దీనికి సంబంధించిన షాకింగ్ సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని శాలిబండలో ఈ ఘటన జరిగినట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె అదృష్టాన్ని చూసి నెటిజన్లు అభినందనల్లో ముంచెత్తుతున్నాయి. ‘ఆమెకింకా భూమిపై నూకలున్నాయి కాబట్టీ సరిపోయింది. లేకపోతే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.’ అంటూ చర్చించుకుంటున్నారు. భారీ గోడ కూలిపోవడంతో పెద్ద ఎత్తున దుమ్ము కూడా లేచింది. ఆ హఠాత్పరిణామానికి ఆ రోడ్డు మీద వెళ్తున్న వారు కూడా కంగారు పడిపోయారు. వాహనదారులు సడన్‌గా బ్రేక్ కొట్టేశారు.

ఆ ఇల్లు ఎప్పుడో పురాతన కాలం నాటిది కావడంతో దాదాపు రెండేళ్ల నుంచి అందులో ఎవరూ నివసించడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ ఇంటి గోడలు మొత్తం నానిపోయాయి. దీంతో అది కుప్పకూలిపోయింది. ఆ మహిళ రోడ్డు మీద వెళ్తూ సమయానికి చూసుకుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆమె మీద గోడ పడితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లేది.ఆమెది అదృష్టం అయితే, మరో బాలుడిది దురదృష్టం. ఇంటి వద్దే ఉన్న బాలుడిని మృత్యువు వెంటాడింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి చేరిన వర్షపు నీరు ఓ చిన్నారిని బలిగొంది. ఆడుకోవడానికి వెళ్లిన మూడేళ్ల బాలుడు సెల్లార్ లో చేరిన వరద నీటిలో మునిగి చనిపోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. యుగేందర్ అనే వ్యక్తి కుటుంబం దిల్‌సుఖ్‌నగర్‌లోని సాహితీ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ అపార్ట్ మెంట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే ఈ రోజు ఉదయం యుగందర్ మూడేళ్ల కుమారుడు అజిత్ సాయి ఆడుకుంటూ సెల్లార్ లోకి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఉన్న నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్‌లోని గగన్ పహాడ్ వద్దే మిద్దెకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో ఎడతెరిపి లేని వర్షానికి బుధవారం రాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. కొండ హనుమంతు రెడ్డి(70), భార్య కొండ అనసూయమ్మ(55), మనవడు హర్షవర్ధన్ రెడ్డి(12) లు మృతి చెందగా మరో ఇద్దరు కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 14, 2020, 10:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading