హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Horticulture : ఎక‌రాకు రూ.30వేల పెట్టుబ‌డితో.. రూ.1.30 లక్షల ఆదాయం.. సీతాఫ‌ల సాగులో రాణిస్తున్న పెద్ద‌ప‌ల్లి జిల్లా రైతు

Telangana Horticulture : ఎక‌రాకు రూ.30వేల పెట్టుబ‌డితో.. రూ.1.30 లక్షల ఆదాయం.. సీతాఫ‌ల సాగులో రాణిస్తున్న పెద్ద‌ప‌ల్లి జిల్లా రైతు

సీతాఫ‌లం సాగులో రైతులు

సీతాఫ‌లం సాగులో రైతులు

Telangana Horticulture : శీతాకాలంలో దొరికే సీతాఫ‌ల పండ్ల సాగులో పెద్ద‌ప‌ల్లి జిల్లా రైతు అధిక లాభాలు గ‌డిస్తున్నాడు. సీతాఫ‌లాల‌ను సేంద్రియ ప‌ద్ధ‌తిలో సాగు చేస్తూ.. ఎక‌రాల‌కు రూ.30వేల పెట్టుబ‌డితో రూ.ల‌క్షా 30వేల ఆదాయాన్ని పొందుతున్నాడు.

ఇంకా చదవండి ...

శీతాకాలంలో దొరికే సీజ‌న‌ల్ పండ్ల‌లో అత్యంత‌ రుచి.. ఆరోగ్య విలువ‌లు ఉన్న పండు సీతాఫ‌లం. తెలంగాణ (Telangana) యాపిల్‌గా పిలుచుకొనే సీతాఫ‌లం (custard apples) ఎక్కువ‌గా అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ నెల‌ల్లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ఎన్నో పోష‌కు విలువ‌లు ఉన్న ఈ పండ్లకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. ఎక్కువ‌గా గుట్టల ప్రాంతాల్లోని చెట్లనుంచి రైతులు సేకరించి పట్టణాల్లో విక్రయిస్తుంటారు. ఏదైన అట‌వీ ప్రాంతాల్లో వ‌ద్ద ప్ర‌యాణిస్తుంటే దారిపొడ‌వునా అమ్ముతుండే వారు. ప్ర‌స్తుతం అలా అమ్మేవారి సంఖ్య త‌గ్గుతోంది. మార్కెట్‌ (Market)లోకి ప్ర‌స్తుతం ఎంతో డిమాండ్ ఉన్న ఈ పండ్ల‌ను కొనేందుకు జ‌నం ఆస‌క్తి చూపుతున్నారు. ఈ విష‌యం గ్ర‌హించిన ఓ పెద్ద‌ప‌ల్లి రైతు సీతాఫ‌లాలు పండిస్తూ అధిక లాభాలు గ‌డిస్తున్నాడు. పండించిన వాటిని విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తూ అధిక లాభాలు గ‌డిస్తున్నాడు.

పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ సాజిద్ అనే రైతు తనకున్న 15 ఎకరాల్లో ఏడు రకాల సీతాఫలం తోటలను పూర్తి ఆర్గానిక్ (Organic) పద్ధతిలో సాగుచేస్తున్నాడు . గోల్డెన్ రకం పండు ఒక్క టికి రూ .200 పలుకుతుండగా .. షుగర్ లెస్ సీతాఫలానికి మంచి డిమాండ్ ఉందని చెబుతున్నాడు . సాజిద్ తోటలోని సీతాఫలాలను ఉమ్మడి క‌రీంన‌గ‌ర్‌తో  పాటు హైదరాబాద్ (Hyderabad), ఏపీ, అమెరికా, తదితర దేశాలకు ఎగుమతి చేస్తుండగా .. ఒక్కసారైనా ఈ పండ్లను ఆస్వాదించాలని పెద్దపల్లి జిల్లా ప్రజలు వారి హితులకు చెబుతుండడం విశేషం..

సేంద్రీయ ప‌ద్ధ‌తి.. అధిక లాభాలు

సాజిద్ పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో సీతాఫలాలను పండిస్తున్నాడు. మొదటినుంచి అంటు కట్టు పద్ధతిని పాటిస్తూ వివిధ రకాల పండ్లను తీసుకొస్తున్నాడు . ఎకరాకు రూ .30 వేల వరకు పెట్టుబడి పెడుతుంటాడు . రూ.1.30 లక్షల వరకు ఆదాయం వస్తోంది. కూలీలకు కూడా మంచి ఉపాధి కల్పిస్తున్నాడు. అన్ సీజన్‌లో రోజుకు 50 మంది వరకు తోటలో పనిచేస్తుంటారు. సీజన్లో 200 మంది వరకు ఉపాధి పొందుతుంటారు . ఈ సీతాఫలంతోటలో సేంద్రియ పద్ధతిలో దిగుబడి అవుతున్న పండ్లకు మంచి డిమాండ్ ఉంది.

Skill Development : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. త‌క్కువ ఫీజుతో స్కిల్స్ కోర్సుల్లో శిక్షణ


ఫ‌లించిన కృషి..

పద్నాలుగేళ్ల క్రితం 15 ఎకరాల విస్తీర్ణంలో మొదట నాలుగు రకాల సీతాఫలం మొక్కలు 10 వేలకు పైగా నాటాడు . తరువాత వాటిసంఖ్య ఏడుకు పెరిగింది . పదేళ్లకు కాపుకు వచ్చాయి . ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పండ్లు తెంపు తుంటారు . పెద్ద సైజుపండ్లను వేరే ప్రాంతాలకు పార్సిల్ చేస్తుంటారు . చిన్నవి పట్టణాల్లోని మార్కెట్లో విక్రయిస్తా అంటున్నాడు సాజిద్.

పెద్దపల్లి జిల్లావాసు లు ఈ పండ్లను రుచిచూడక మానరు . ఉమ్మడి కరీంనగర్ జిల్లా తో పాటు హైదరాబాద్ , వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి తోటవద్దనే పండ్లు కొంటున్నారు . అదే విధంగా కర్ణాటక , మహారాష్ట్ర , పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాలతో పాటు అమెరికా , సౌదీఅరేబియా , జర్మనీలాంటి విదేశాలలోని తమబంధు , మిత్రులకు జిల్లావాసులు సీజన్లో పండ్లను తప్పకుండా పంపిస్తుంటారు .

Hyderabad Rains: ఇవి రోడ్లేనా? చెరువులా? హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. షాకింగ్ వీడియోలు


సీతాఫ‌ల పండ్లు తిన‌డం వ‌ల్ల‌ లాభాలు..


  • సీతాఫ‌ల పండ్ల‌లో విటమిన్‌ సీ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఈ పండు ఎన్నో రకాల జబ్బులను నివారిస్తుంది.

  • కేన్సర్‌ రాకుండా కాపాడుతుందని కొన్ని నివేదికలు తెలిపాయి. పండ్ల‌లో ఉండే ఐరన్, కాపర్‌ పుష్కలంగా ఉంటుంది. ఎనిమియా(Anemia)ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

  • అంతే కాకుండా బీ6 విటమిన్‌ ఎక్కువగా ఉండటం వల్ల అస్తమా రాకుండా ఉంటుంది. ఏ, బీ విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో రోజుకు ఒక ఫ్రూట్‌ తినడం మంచిది. బలహీనత, ఒత్తిడితో బాధపడుతున్నవారికి, డిప్రెషన్‌కు కూడా మందులా పనిచేస్తుంది.

  • బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కొలమానంగా పనిచేస్తుంది. కేలరీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం మేలు. రోజుకి 900 మైక్రో గ్రాముల కాపర్‌ కావాల్సింది కాబట్టి.. ఈ పండు తినాలి. ఇక ఈ పండుతో చిగుళ్ల నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది.

First published:

Tags: Agriculuture, Farmers, Organic Farming, Telangana

ఉత్తమ కథలు