Home /News /telangana /

నిద్రపోతున్న కూతురిని గొంతు నులిమి చంపిన తల్లి.. తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని దారుణం

నిద్రపోతున్న కూతురిని గొంతు నులిమి చంపిన తల్లి.. తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Warangal Honor Killing: పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. అంజలి ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. పోలీసులు తమదైన స్టైల్లో తల్లిని విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది. కన్నతల్లే ఆమెను చంపిందని వెల్లడయింది.

  కాలం మారుతున్నా కొందరి తల్లిదండ్రుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చిన్నప్పటి నుంచి తమ కూతురిని అల్లారు ముద్దుగా పెంచుతారు. ఏం కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తారు. కానీ ఒక పెళ్లి విషయంలో మాత్రం ఆమెకు ఆప్షన్ ఇవ్వడం లేదు. మనసుకు నచ్చిన వాడిని మనువాడే కోరికను నెరవేర్చడం లేదు. డబ్బు లేదనో.. కులం తక్కువ వాడనో చెప్పి..తన కూతురి ప్రేమను కాదంటున్నారు. కొందరైతే పరువు కోసం ప్రాణాలు తీస్తున్నారు. తమ కడుపులో పుట్టిన బిడ్డనే కసిదీరా చంపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా మరో పరువు హత్య కలకలం రేపింది. తక్కువ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందన్న కోపంతో కన్న కూతురిని చంపేసిందో తల్లి. అనంతరం తమకు ఏమీ తెలియనట్లుగా డ్రామాలాడింది. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. వరంగల్ జిల్లాలో ఈ దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది.

  పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ప్రస్తుతం కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. పెద్ద కుమార్తెకు ఇప్పటికే పెళ్లి చేసింది సమ్మక్క. చిన్న కూతురు అంజలి పదో తరగతి చదువుతోంది. ఆమె వయసు 17 ఏళ్లు. ఐతే కొన్ని రోజులుగా అంజలి ప్రవర్తనలో మార్పును గమనించింది ఆమె తల్లి సమ్మక్క. అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్ అనే యువకుడితో అంజలి ప్రేమలో పడినట్లు తన దృష్టికి వచ్చింది. ప్రేమ పేరుతో నాటకాలు వేయొద్దని మందలించింది. అతడు తమ కులం వాడు కాదని..మరిపోవాలని సూచించింది. ఐనా అంజలి వినలేదు. ఈ క్రమంలో అంజలి తల్లి, ఆమె అమ్మమ్మ యాకమ్మ ఒకటి రెండు చేయి కూడా చేసుకున్నారు. ఐనా ఆ అమ్మాయి మాత్రం వినలేదు.

  బెంగళూరులో దారుణం, మహిళా ప్యాసెంజర్ చూస్తుండగానే, హస్త ప్రయోగం

  అంజలి తీరు మారకపోవడంతో సమ్మక్క కోపంతో రగిలిపోయింది. తమ కుటుంబ పరువు తీస్తోందనే ఆగ్రహంతో సంచలన నిర్ణయం తీసుకుంది. కన్న కూతురిని చంపాలని స్కెచ్చ వేసింది. అనుకున్నట్లుగానే తన తల్లితో కలిసి నవంబరు 19 అర్ధరాత్రి అంజలిని చంపేసింది సమ్మక్క. ఇంటిలో నిద్రిస్తున్న అంజలి గొంతును ఇద్దరు కలిసి నులిమారు. వద్దమ్మా.. అని ఏడ్చినా వినలేదు. ఆ తర్వాత ఆమె అమ్మమ్మ దిండుతో ముఖాన్ని అధిమిపట్టింది. అలా ఊపిరాడకుండా చేసి అంజలిని చంపేశారు. ఆ తర్వాత తమ ఏమీ తెలియనట్లుగా నటించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని ఇరుగు పొరుగుకు చెప్పి కన్నీరు కార్చారు.

  యూపీలో దారుణం..కట్టుకున్న భర్త తొలి రాత్రి భార్యకు మత్తు మందు ఇచ్చి స్నేహితులతో కలిసి రేప్

  ఘటనపై సమాచారం అందుకున్న పర్వతగిరి పోలీసులకు ఆమె ఇంటికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తమ కూతురు నిద్రమాత్రలు మింగి మరణించిందని సమ్మక్క బోరును విలపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఐతే పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. అంజలి ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. ఈ నేపథ్యంలో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మామూనూర్ ఏసీపీ నరేష్ కుమార్ అధ్వర్యంలో దర్యాప్తు చేయగా..అసలు నిజం బయటపడింది. కన్న తల్లే చంపినట్లు తెలిసింది. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించారు. తమ మాట వినకపోవడంతో పాటు తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి.. తమ కుటుంబ పరువు తీస్తోందని సహించలేకే.. అంజలిని హత్య చేసినట్లు సమ్మక్క, అమ్మమ్మ యాకమ్మ ఒప్పుకున్నారు. వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Warangal

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు