వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఆందోళనకర అనుభవం ఎదురైంది. ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తోన్న ఆమెపై బుధవారం నాడు తేనెటీగలు దాడి చేశాయి. యాదాద్రి జిల్లాలోని మోట కొండూరు మండలం నుంచి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో వైఎస్ షర్మిల దుర్గసానినపల్లి గ్రామం వద్ద చెట్టుకింద ఆగి, గ్రామస్తులతో మాట్లాడుడారు. సరిగ్గా ఆసమంలోనే పెద్ద తేనెటీగల గుంపు దాడి చేసింది..
షర్మిల బృందంపై తేనెటీగలు దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. అయితే ఈ తేనె తీగల దాడి నుంచి వైయస్ షర్మిల బయటపడ్డారు. ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది, వైఎస్సార్ టీపీ శ్రేణులు తమ కండువాలనే ఆయుధాలుగా గాల్లోకి ఊపుతూ ఈగలను తరిమేశారు. తేనెటీగల దాడిలో పార్టీ కార్య కర్తలు పలువురికి గాయాలయ్యాయి. ఘటన అనంతరం షర్మిల పాద యాత్రను యథావిధంగా కొనసాగిస్తున్నారు.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు.. ఇక, క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ.. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర సాగిస్తున్నారు. బుధవారం నాటికి షర్మిల పాదయాత్ర 34వ రోజుకు చేరింది. తెలంగాణ నిరుద్యోగ సమస్యను షర్మిల ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకు కదులుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attack, Yadadri, YS Sharmila, Ysrtp