ఎన్ఓసీలు నిలిపేశాం.. విద్యార్థులెవరూ సొంతూళ్లకు వెళ్లొద్దన్న హోంమంత్రి

తెలంగాణలో ఎన్ఓసీలు ఇవ్వడం పూర్తిగా నిలిపేశామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. విద్యార్థులెవరూ హాస్టల్స్‌ను వదిలి సొంతూళ్లకు వెళ్లొద్దని సూచించారు.

news18-telugu
Updated: March 26, 2020, 3:20 PM IST
ఎన్ఓసీలు నిలిపేశాం.. విద్యార్థులెవరూ సొంతూళ్లకు వెళ్లొద్దన్న హోంమంత్రి
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ (File)
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ నగరంలోని హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు లౌక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్స్ ఖాళీ చేయాలని చెబుతుండడంతో పాటు సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు ఆస్తకి చూపుతున్నారు. అందులో భాగంగానే బుధవారం పెద్దఎత్తున తమకు పాస్‌లు అందివ్వాలని నగరంలోని ఆయా పోలీసు స్టేషన్లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు సైతం పాసులను జారీ చేశారు.

అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆయా ప్రాంతాల వారు రానివ్వకపోవడం, రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద విద్యార్థులు పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో హోమంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ తెలంగాణలో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుందని, ఎన్ఓసీలను పూర్తిగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. హాస్టల్స్‌లో ఉణ్న విద్యార్థులెవరూ సొంతూళ్లకు వెళ్లొద్దని సూచించారు. అలా వెళ్లడం ద్వారా లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపారు. హాస్టల్స్ నిర్వాహకులకు ప్రభుత్వం సాయం చేస్తుందని, విద్యార్థులను హాస్టల్స్ ఖాళీ చేయాలని చెప్పొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే హాస్టల్స్ యాజమానులపై చర్యలు ఉంటాయని హోంమంత్రి హెచ్చరించారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు