• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HOME MINISTER MAHMOOD ALI NOT GET PERMISSION TO ENTER CM KCR PRAGATI BHAVAN AK

ప్రగతి భవన్‌లోకి హోంమంత్రికి నో ఎంట్రీ...

ప్రగతి భవన్‌లోకి హోంమంత్రికి నో ఎంట్రీ...

హోంమంత్రి మహమూద్ అలీ(ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ సమీక్షలో ఉన్న కారణంగా హోంమంత్రి మహమూద్ అలీకి ప్రగతి భవన్‌లోకి అనుమతించలేదని తెలుస్తోంది.

  • Share this:
    తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు ప్రగతిభవన్‌లో నేరుగా ప్రవేశం లభించలేదు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై బుధవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే మహమూద్‌ అలీ ప్రగతి భవన్‌కు వచ్చారు. అయితే ప్రగతిభవన్‌ ప్రవేశ ద్వారం వద్దే ఆయనను భద్రతా సిబ్బంది నిలిపేశారు. కొంతసేపు అక్కడే వేచిచూసిన మహమూద్‌ అలీ తిరిగి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్‌ ముఖ్యమైన సమీక్ష నిర్వహిస్తున్నందున లోపలికి ఎవరినీ అనుమతించరాదని ఆదేశాలున్నాయని, హోంమంత్రి వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందేలోగా ఆయన వెళ్లిపోయారని తెలుస్తోంది.

    అయితే తనకు ప్రగతి భవన్‌లోకి అనుమతించలేదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని హోంమంత్రి మహమూద్ అలీ వివరణ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన కార్యాలయ అధికారి ప్రకటన విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సీఎంను కలిసేందుకు వెళ్లగా.. అదే సమయానికి ఆయన గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధపడ్డారని తెలిసి హోంమంత్రి వెనుదిరిగారని వివరించారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడంలో హోంమంత్రి మహమూద్‌ అలీకి ఏనాడూ ఎలాంటి ఇబ్బందులూ ఎదురవలేదని, ఆయనను ప్రగతి భవన్‌లోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోలేదని స్పష్టంచేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: