Amit shah tour in Telangana : సెప్టెంబర్ 17 వేడుకలకు అమిత్ షా.. టూర్ కన్‌ఫం..!

అమిత్ షా

Amit shah tour in Telanagna : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఈనెల 7న ఆయన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సంధర్భంగా నిర్మల్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిధిగా హజరుకానున్నారు.

  • Share this:
    తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ అధికారికంగా నిర్వహించాలని బీజేపీ(BJP) డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే... ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నిర్మల్‌లోని(Nirmal) వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభకు (public meeting) ఏర్పాట్లు చేస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఆనాటి రజాకార్లు మర్రి చెట్టు వద్ద ఊచకోత కోశారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతం వెయ్యి ఊడల మర్రిగా ప్రసిద్ధి చెందింది.

    మరోవైపు గత పదకొండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) సెప్టెంబర్ 17నాటికి ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్‌కు చేరుకునేలా నేతలు ప్లాన్ చేశారు. అదే రోజు పాదయాత్రతో పాటు బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సంధర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొనున్న అమిత్ షా విమోచన దినోత్సవం సందర్భంగా రాజకీయంగా కీలక ప్రకటన ఏదైనా చేస్తారా అనే చర్చ అటు పార్టీతో పాటు ఇటు ప్రజల్లో చర్చ కొనసాగుతోంది.

    ఇది చదవండి : జలమయం అయిన కరీంనగర్ .. వంతెన దాటుతూ తండ్రి కొడుకులు గల్లంతు..!


    మరోవైపు, వచ్చే ఎన్నికల నాటికీ తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) రాష్ట్రంలో ప్రజా ఆశీర్వాద యాత్రను చేపట్టగా.. మరోవైపు, బండి సంజయ్ కూడా పాదయాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర హోం మంత్రి సైతం పర్యటన కు రావడం బీజేపికి మరింత ఊపునివ్వనుంది..

    ఇది చదవండి : వినాయక నిమజ్జనంపై ఇంట్రస్ట్ లేదా.. అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. కారణం ఇదే..

    Published by:yveerash yveerash
    First published: