హోమ్ /వార్తలు /తెలంగాణ /

Amit Shah: ఈ నెల 16న హైదరాబాద్‌కి అమిత్ షా.. నెలలో రెండోసారి.. 2 రోజులు ఇక్కడే

Amit Shah: ఈ నెల 16న హైదరాబాద్‌కి అమిత్ షా.. నెలలో రెండోసారి.. 2 రోజులు ఇక్కడే

(AMIT SHAH FILE PHOTO)

(AMIT SHAH FILE PHOTO)

Amit Shah Hyderabad Tour: తెలంగాణ విలీన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఆయన టూర్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబరు 16న ఆయన హైదరాబాద్‌కు వస్తారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  సెప్టెంబరు 17 సమీపించే కొద్దీ.. తెలగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను (Telangana Liberation day) వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా జాతీయత సమైక్యతా దినంగా (National Integrity Day) జరపబోతోంది. పోటాపోటీ కార్యక్రమాలతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ విలీన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ (Hyderabad Amit Shah Tour) రానున్నారు. ఈ మేరకు ఆయన టూర్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబరు 16న ఆయన హైదరాబాద్‌కు వస్తారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ విమోచన వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలతో సమావేశమవుతారు అమిత్ షా. నెల రోజుల వ్యవధిలో తెలంగాణలో అమిత్ షా పర్యటించడం ఇది రెండోసారి. గత నెల 21న మునుగోడులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్నారు.


  సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంంది. ఆ బాధ్యతలను సాంస్కృతికశాఖ మంత్రి కిషన్ రెడ్డి చూస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనానికి 74 ఏళ్లు పూర్తై.. 75 వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో.. ఏడాది పొడవునా ఉత్సవాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్ అమిత్ షా హాజరుకానున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా.. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ , కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలకు ఆహ్వానం పంపించారు.


  • KCR| TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫుల్ హ్యాపీ.. సీఎం కేసీఆర్ అలాంటి గుడ్ న్యూస్ చెప్పారా ?


  మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మళ్లీ వచ్చే ఏడాది  సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో ముగింపు ఉత్సవాల జరుపుతారు.ఈ నెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నగర, పురపాలక, పంచాయతీ కేంద్రాల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలతో.. ఆ రోజున ఏం జరుగుతుంది? సీఎం కేసీఆర్, హోంమంత్రి ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amit Shah, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు