తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మరిన్ని రోజులు సెలవులు ప్రకటించిందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవులను ఈ నెల 31 వరకు పొడిగించిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. టీవీ9 బ్రేకింగ్ ప్లేట్‌ను మార్పింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారం చేపట్టారు. అయితే దీనిపై టీవీ9 యాజమాన్యం స్పందించింది. కొందరు తమ పేరుతో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని... వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవులను ఈ నెల 19 వరకు ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న తెలంగాణలోని విద్యాసంస్థలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో కొందరు మరోసారి తెలంగాణ ప్రభుత్వం సెలవులను పొడిగించిన ప్రచారం మొదలుపెట్టారు.
#TV9 వీడియోను మార్ఫింగ్ చేసిన అగంతకుడుhttps://t.co/0ClWPeTG1q
— TV9 Telugu (@TV9Telugu) October 17, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Tsrtc, TSRTC Strike, TV9