news18-telugu
Updated: August 5, 2020, 3:19 AM IST
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-3 1400ఎంఎం పైపులైనుకు జంక్షన్ పనులు చేపడుతున్న కారణంగా తేది. 05.08.2020 బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది.06.08.2020 గురువారం ఉదయం 6గంటల వరకు 24 గంటల పాటు ఈ మరమ్మత్తు ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ 24 గంటలు కింద ఇవ్వబడిన ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:షేక్పేట్ , టోలిచౌకి, ప్రశాసానగర్, జూబ్లీ హిల్స్ , తట్టిఖాన, మాదా పూర్, గచ్చిబౌలి, గోల్డెన్ హైట్స్, హైదర్గుడ, అత్తాపూర్ రిజర్వాయర్ ప్రాంతాలు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని హైదరాబాద్ మెట్రో వాటర్ కోరింది.
Published by:
Janardhan V
First published:
August 5, 2020, 3:15 AM IST