• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HIS WIFE HAD AN EXTRAMARITAL AFFAIR WITH SOMEONE ELSE THE HUSBAND WAS SHOCKED TO SEE THE TWO OF THEM BEING IN THE ROOM COMPLAINED TO THE POLICE VB

Extramarital Affair: ప్రియుడితో కలిసి భార్య రాసలీలలు.. అది చూసిన భర్త ఏం చేశాడో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

Extramarital Affair: తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోగా.. వారిద్దరు గదిలో ఉండటం చూసిన భర్త షాక్ కు గురయ్యాడు. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ జంట పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్న భర్త షాక్ అయ్యాడు. పెళ్లి చేసుకుని భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న భర్తకు ఈ విషయం తెలిసి బాగా బాధపడ్డాడు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకు ఈ విషయం తెలుసుకున్న అతడు ఆమెను ఎన్నో సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. భర్త హెచ్చరికలను భార్య పెడచెవిన పెట్టింది. భార్య, ఆమె ప్రియుడు రాసలీలలు సాగిస్తున్న సమయంలో భర్త వాళ్లిద్దరిని పట్టుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా, భైంసాలోని ఏపీ నగర్‌లో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా, భైంసాలోని ఏపీ నగర్‌ కు చెందిన ఓ మహిళ ఐదేళ్ల కిందట రాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొంతకాలం నుంచి ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది తెలుసుకున్న రాజు ఆమెకు ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఆమె మరో వ్యక్తి రూపేశ్ తో ఉండగా రాజు చూసి షాక్ అయ్యాడు.

    వెంటనే వారిద్దరినీ ఓ గదిలో బంధించి, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చే విషయం గమనించి సదరు భార్య లోపల గడియ పెట్టుకుంది. పోలీసులు ఎంత చెప్పినా బయటకు రాకుండా లోపలే ఉండిపోయింది. దాదాపు 4 గంటల వరకు గదిలోనే ఉండి ఆమె చుక్కలు చూపించింది. ఎట్టకేలకు గడియ తెరిచి పోలీసులు వారిద్దరీ అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇరువురికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: