హోమ్ /వార్తలు /తెలంగాణ /

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోసం మహారాష్ట్రలో ర్యాలీలు... వీడియోలు వైరల్

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోసం మహారాష్ట్రలో ర్యాలీలు... వీడియోలు వైరల్

రాజాసింగ్‌కు మద్దతుగా ర్యాలీ

రాజాసింగ్‌కు మద్దతుగా ర్యాలీ

Raja singh: మహారాష్ట్రలోని పుణెలో రాజాసింగ్‌కు మద్దతుగా భారీ ర్యాలీ జరిగింది. సమస్త్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  రాజసింగ్‌ను రిలీజ్ చేయాలని వారంతా డిమాండ్ చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైలులో ఉన్నారు.  ఒక వర్గాన్ని కించపరిచేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయనపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టారు. ఆయనకు మద్దతుగా గత నెలలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ (Telangana) వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఐతే తెలంగాణలో మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ రాజాసింగ్‌కు మద్దతుగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి.  తాజాగా మహారాష్ట్రలోని పుణెలో రాజాసింగ్‌కు మద్దతుగా భారీ ర్యాలీ జరిగింది. సమస్త్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  రాజాసింగ్‌కు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శించారు.టైగర్ రాజాసింగ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  BJP vs Trs : మీటర్‌పై కామెంట్‌తో కోమటిరెడ్డి మ్యాటర్ పేలిపోతుందా ..? లేక తేలిపోతుందా..?

  కాగా, చర్లపల్లి జైలులో రాజాసింగ్‌కు ప్రాణహాని ఉందని ఆయన సతీమణి ఉషాబాయి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజాసింగ్‌కు ప్రత్యేక భద్రత కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆయన జైల్లో కటిక నేలపై పడుకుంటున్నారని.. తెలంగాణ ప్రిజన్ రూల్స్ కింద స్పెషల్ క్లాస్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజాసింగ్ జైల్లో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఆయన ఎమ్మెల్యేనని అన్నారు. రాజాసింగ్‌ను కలిసేందుకు నియోజక ఓటర్లు, పౌరుల ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో కీలకంగా వ్యవహరించే చట్ట సభ్యులను కలుసుకునేం హక్కు ప్రజలకు ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రిజన్ యాక్ట్-1894, తెలంగాణ ప్రిజన్ రూల్స్ ప్రకారం.. ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్.. కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను పొందేందుకు అర్హుడని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కనీస సౌకర్యాలైన టేబుల్, బెడ్, కుర్చీతో పాటు పుస్తకాలు, వార్తా పత్రికలు అందజేయాలని కోరారు.

  గురువారం బండి సంజయ్ (Bandi Sanjay) నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో రాజాసింగ్ పేరు మార్మోగిపోయింది. స్టేజిపై బీజేపీ నేతలు ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. రాజాసింగ్.. రాజాసింగ్ అంటూ నినాదాలు చేశారు. రాజాసింగ్ ఎక్కడ అంటూ గట్టి అరిచారు. రాజాసింగ్‌పై మాట్లాడాలని డిమాండ్ చేశారు. వెంటనే బండి సంజయ్ కలగజేసుకొని.. వాళ్లని సముదాయించారు. తాము జైలుకు భయపడే వ్యక్తులం కాదని అన్నారు. జైలుకు పంపిన వారిని, కుట్రపన్నిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bjp, Hyderabad, Raja Singh, Telangana

  ఉత్తమ కథలు