Home /News /telangana /

HINDU COMMUNITIES ANGRY OVER DRESS CODE DISPUTE AT MISSIONARY SCHOOL IN ADILABAD DISTRICT SNR ADB

Adilabad: మిషనరీ స్కూల్‌లో డ్రెస్‌ కోడ్ పంచాయితీ..ఇదేం పద్దతిగా లేదంటే..

(డ్రెస్‌ కోడ్ వివాదం)

(డ్రెస్‌ కోడ్ వివాదం)

Adilabad:ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర మిషనరీ స్కూల్‌లో డ్రెస్‌కోడ్ అభ్యంతరం పెట్టడంతో వివాదం చెలరేగింది. స్కూల్‌ యాజమాన్యంపై హిందూసంఘాలు ఆగ్రహం తెలపడంతో అధ్యాపకులు దిగొచ్చారు. స్కూడెంట్స్‌ని క్లాస్‌రూమ్‌లోకి అనుమతించారు.

    విద్య నేర్పించే చోట స్టూడెంట్స్‌ డ్రెస్‌ కోడ్‌ విషయంలో యాజమాన్యాలు, అధ్యాపకులు విమర్శలకు గురవుతున్నారు. ఆమధ్య కాలంలో హిజాబ్‌ వివాదం దేశ వ్యాప్తంగా దుమారం రేపిన విషయం మర్చిపోక ముందే ఆదిలాబాద్(Adilabad)జిల్లాలో ఓ పాఠశాల యాజమాన్యం స్టూడెంట్స్‌ డ్రెస్‌ కోడ్‌(Dress code dispute)పై అభ్యంతరం తెలిపి క్లాసులకు అనుమతించకపోవడం కలకలం రేపింది. బోథ్ (Both) మండలం పొచ్చెర(Pochchera)ఎక్స్‌రోడ్డు దగ్గరలో ఉన్న సెయింట్ థామస్ మిషనరీ స్కూల్‌ (St.Thomas Missionary School)లో చదువుతున్న కొందరు విద్యార్ధులు హునుమాన్‌ (Hunuman‌)మాల ధరించారు. కాషాయ దుస్తులు వేసుకొని తరగతులకు హాజరవడంపై స్కూల్ యాజమాన్యం, టీచర్లు (Teachers)అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో సరిపెట్టుకోకుండా విద్యార్ధులను దీక్షాలో వేసుకున్న దుస్తులను వదిలి వేరే యూనిఫామ్‌లో రావాలని ఆదేశించారు. విద్యార్ధులు దీక్షను మధ్యలో విరమించడం కుదరదని విద్యార్దులు చెప్పడంతో ఇంటికి పంపించారు. ఉపాధ్యాయులు హుకుం జారీ చేసిన విషయాన్ని విద్యార్ధులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో హిందూ సంఘాల (Hindu communitie)sనాయకులు, హనుమాన్ భక్తులు, విద్యార్థి సంఘం నాయకులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు.

    అనవసరమైన రాద్ధాంతం..
    ఈ పాఠశాల మిషనరీ కి సంబంధించింది కాబట్టే పాఠశాల యాజమాన్యం ఇలా ప్రవర్తిస్తున్నారని ఆందోళనకు ఆరోపించారు. మాలదారణ చేసుకున్న విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి పాఠశాలలోకి రాకుండా అడ్డుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకువాలని విద్యార్ధి సంఘాలు, బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ పాఠశాలలో క్రిస్టియన్స్ మతానికి  సంబందించిన ప్రార్థనలు హిందూ విద్యార్థులతో చేయిస్తున్నారే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పాఠశాలలో మతప్రచారం జరిగినప్పుడు లేనిది హిందు విద్యార్తులు మాలధారణ చేసి వస్తే అడ్డుకోవటం ఏంటని హిందూ సంఘ నాయకులు నిలదీయటంతో యాజమాన్యం ఎట్టకేలకు దిగివచ్చి విద్యార్థులను తరగతులకు అనుమతించింది.

    ఇదెక్కడి తిరకాసు..
    ఇటీవల కాలంలో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ, అజమాయిషి లేని కారణంగా తాము ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా తయారైంది. అయితే ఈ ఆందోళన నేపథ్యంలో  ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు పాఠశాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. స్కూల్‌ వ్యవస్థలో ఇప్పటి వరకు ఇలాంటి వివాదాలు, విభేదాలు ఎక్కడా తలెత్తిన దాఖలాలు లేవు. కాని ఇప్పుడు పొచ్చెర మిషనరీ స్కూల్‌ యాజమాన్యం చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్ధులకు ఇలాంటి కండీషన్స్ పెట్టడం, కుల, మత ప్రస్తావన లేకుండా విద్యను బోధించాల్సిన చోట  సెంటిమెంట్‌తో కూడిన విషయాలపై రాద్ధాంతం చేయడం తగదంటున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Adilabad, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు