‘రూ.5116 ఇస్తారా? ఇవ్వరా..’ తెలంగాణలో అదనపు కలెక్టర్‌కు హిజ్రాల సెగ...

అదనపు కలెక్టర్‌తో పాటు అక్కడున్న రెవిన్యూ అధికారులు కూడా హిజ్రాలను వెళ్లిపోవాలని కోరారు. ఎంత చెప్పినా కూడా హిజ్రాలు కదల్లేదు.

news18-telugu
Updated: March 15, 2020, 1:02 PM IST
‘రూ.5116 ఇస్తారా? ఇవ్వరా..’ తెలంగాణలో అదనపు కలెక్టర్‌కు హిజ్రాల సెగ...
అదనపు కలెక్టర్‌ను రూ.5116 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న హిజ్రాలు
  • Share this:
రాజన్న సిరిసిల్లి జిల్లా అదనపు కలెక్టర్ కు హిజ్రాల సెగ తగిలింది. రూ.5116 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ సాయం చేసినా వెళ్లకుండా అక్కడే ఉన్నారు. ఇతర అధికారులు ఆగ్రహించినా వెళ్లలేదు. దీంతో గత్యంతరం లేక రెవిన్యూ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే వరకు హిజ్రాలు వెళ్లే వరకు అదనపు కలెక్టర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనే ఉండిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇటీవలే నూతనంగా బదిలీ పై వచ్చిన అదనపు కలెక్టర్ అంజయ్య ఆదివారం ఎల్లారెడ్డి పేట లోని డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లారు. సమాచారం తెలిసిన నలుగురు హిజ్రాలు అక్కడికి చేరుకుని తమకు డబ్బులు ఇవ్వాలని అదనపు కలెక్టర్ ను కోరారు. ఆయన వారి కోరిక మేరకు తన జేబులోని పర్సు తీసి తనకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేశారు. ఆయన ఇచ్చిన డబ్బుకు సంతృప్తి చెందని హిజ్రాలు రూ.5,116 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్ బయటకు వెళ్లకుండా ఆయనకు అడ్డుగా నిలబడ్డారు.

అదనపు కలెక్టర్‌తో పాటు అక్కడున్న రెవిన్యూ అధికారులు కూడా హిజ్రాలను వెళ్లిపోవాలని కోరారు. ఎంత చెప్పినా కూడా హిజ్రాలు కదల్లేదు. దీంతో అధికారులు వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతసేపైనా డబుల్ బెడ్రూం ఇళ్ళ ప్రాంతం నుంచి కదలకుండా వుండిపోయారు. దీంతో రెవిన్యూ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొంత అలస్యంగానే అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చి హిజ్రాలకు అక్కడి నుంచి పంపించే వరకు అదనపు కలెక్టర్ వేచి వుండి ఇళ్ళ నిర్మాణాలను పూర్తిగా పరిశీలించారు. హిజ్రాలు వెళ్లినట్లు అధికారులు తెలపడంతో అదనపు కలెక్టర్ అంజయ్య డబుల్ ఇళ్ళ నుంచి వెళ్లి పోయారు.
First published: March 15, 2020, 1:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading