తెలంగాణలో మండుతున్న ఎండలు .. నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు

ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

ఉదయం పదకొండు గంటలు అయ్యిందంటే చాలు ప్రధాన రోడ్లే కాదు గల్లీలు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి.

  • Share this:
    నిజామాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సూర్యుడు ఉగ్రరూపం పసిపిల్లలకు వృద్ధులకు నరక ప్రాయమైంది.. కరోనా వైర‌స్ కార‌ణంగా గ‌త 45 రోజులు పాటు ఇంట్లోనే ఉండి ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డంతో జ‌నాలు ఎండాల‌ను త‌ట్టుకోలేక పోతున్నారు.. ఉక్కపోత దాహార్తిని తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలతో కొంత ఉపశమనం పొందుతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇక పచ్చని పంటలు పండే నిజామాబాద్-కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా మారింది.. ఉదయం ఎనిమిది గంటలకే ఎండలు మండిపోతున్నాయి ..గ‌త వారం రోజులుగా వ‌రుస‌గా 44, 43 డీగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి.. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం పదకొండు గంటలు అయ్యిందంటే చాలు ప్రధాన రోడ్లే కాదు గల్లీలు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి. దీనికి తోడు అప్పుడప్పుడు ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది.. ఉక్కపోత నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబిస్తున్నారు.. కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.. చల్లని నీరు కోసం ఉన్నత శ్రేణి వారు ప్రీజ్ ల‌ను, పేదలు కుండలు, కూజాలను కొనుగోలు చేసుకుంటున్నారు. మరోవైపు తాత్కాలిక ఉపశమనం కోసం చల్లని పండ్ల రసాలను సేవించి దప్పిక తీర్చుకుంటున్నారు..ఇప్పుడే ఇలా ఉంటే మ‌రో 20 రోజులు ఏలా ఉంటుందో అని స్థానిక ప్ర‌జ‌లు బ‌యందోళ‌ల‌కు గుర‌వుతున్నారు..
    పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు, ప్ర‌తినిధి..
    Published by:Venu Gopal
    First published: