హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఫ్లాష్..ఫ్లాష్: కామారెడ్డిలో హైటెన్షన్..బండి సంజయ్ అరెస్ట్..హైదరాబాద్ కు తరలింపు

ఫ్లాష్..ఫ్లాష్: కామారెడ్డిలో హైటెన్షన్..బండి సంజయ్ అరెస్ట్..హైదరాబాద్ కు తరలింపు

బండి సంజయ్ అరెస్ట్

బండి సంజయ్ అరెస్ట్

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బిక్కనూర్ నుంచి హైదరాబాద్ పీఎస్ కు తరలిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Kamareddy

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్  (Bandi Sanjay) ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను బిక్కనూర్ నుంచి హైదరాబాద్ పీఎస్ కు తరలిస్తున్నారు. బండి సంజయ్  (Bandi Sanjay) అరెస్ట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎత్తివేసిన కార్యకర్తలు పోలీస్ వాహనంపై దాడి చేశారు. దీనితో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా బీజేపీ శ్రేణులు గేట్లు ఎక్కబోయారు. అడ్డుకున్న పోలీసులు వారిని  చెదరగొట్టారు.

'కేసీఆర్ కు బట్టతల బాధితుల సంచలన డిమాండ్'..సంక్రాంతి వరకు ఫించన్ ఇవ్వాల్సిందే..లేదంటే..

అంతకుముందు మాస్టర్ ప్లాన్‌ను(Master Plan) వ్యతిరేకిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని బండి సంజయ్ (Bandi Sanjay) పరామర్శించారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. వున్న రెండెకరాలు కూడా ఇండస్ట్రియల్ జోన్‌కు పోతుందున్న ఆవేదనతోనే రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతులతో మొండిగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇండస్ట్రియల్ జోన్‌కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదని బండి సంజయ్  (Bandi Sanjay)స్పష్టం చేశారు. రెండు పంటలు పండించే రైతుల పొలాలను గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాయడం దీనినే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు వున్నాయని.. వాటిని ఇండస్ట్రియల్ జోన్‌ కింద తీసుకోవచ్చు కదా అని సంజయ్  (Bandi Sanjay) ప్రశ్నించారు.

Telangana: ఎమ్మెల్యేల ఎర కేసులో ఊహించని ట్విస్ట్..సీబీఐ ఢిల్లీ విభాగానికి దర్యాప్తు బాధ్యతలు

కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్‌పై కూడా బండి సంజయ్  (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్‌పై వుందని.. చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలని అన్నారు. లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలన్నారు. తెలంగాణలో రైతులు సమస్యల్ని పట్టించుకోని కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలోని పట్టణాలు, నగరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్  (Bandi Sanjay) డిమాండ్ చేశారు.

ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మాస్టర్‌ ప్లాన్‌ను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. రైతులు ఆందోళన చేయకుంటే అసలు ఈ విషయం బయటపడేది కాదని సంజయ్  (Bandi Sanjay) వ్యాఖ్యానించారు.

First published:

Tags: Bandi sanjay, Bjp, Hyderabad, Telangana

ఉత్తమ కథలు