బైక్‌ పార్కింగ్‌కి రూ.425... బిల్లు చూసి షాకైన ప్రయాణికుడు

Secunderabad Railway Station : సికింద్రాబాద్ స్టేషన్‌లో పార్కింగ్ దందాకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రయాణికుల అవసరాల్ని క్యాష్ చేసుకుంటూ... అడ్డగోలుగా పారింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 28, 2019, 6:01 AM IST
బైక్‌ పార్కింగ్‌కి రూ.425... బిల్లు చూసి షాకైన ప్రయాణికుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Indian Railways : పార్కింగ్‌లో బండి పార్క్ చెయ్యకపోతే... పోలీసులు ఫైన్లు వేస్తారు. పోనీ పార్కింగ్‌లో బండి పెడదామంటే... అడ్డగోలు దోపిడీ. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఓ వైపు సంప్రదాయ రైళ్లు, మరోవైపు మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి రావడంతో... పార్కింగ్ ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కారు పార్క్ చేస్తే... GSTతో కలిపి గంటకు రూ.47 వసూలు చేస్తున్నారు. పొరపాటున ఓ పది గంటలు పార్క్ చేస్తే... రూ.470 వదిలిపోయినట్లే. బైక్ విషయంలోనూ అంతే. GSTతో కలిపి గంటకు రూ.18 వసూలు చేస్తున్నారు. ఏ దూర ప్రయాణానికో వెళ్లి... రోజంతా బైక్‌ని పార్క్ చేస్తే... రూ.425 వదిలిపోయినట్లే. ఈ ఫీజుల దందా ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నా... పట్టించుకునేవాళ్లు లేరు.

సాధారణంగా సికింద్రాబాద్ నుంచీ... చాలా మంది హైటెక్ సిటీ ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు... MMTSలో వెళ్తూ... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర తమ వాహనాల్ని పార్కింగ్ చేసుకుంటున్నారు. చిత్రమేంటంటే... MMTSలో టికెట్ ఛార్జీ... వెళ్లే దూరాన్ని బట్టీ... రూ.5 లేదా రూ.10 ఉంటుంది. అక్కడ డబ్బు ఆదాచేసుకుంటున్న ప్రయాణికులపై... పార్కింగ్ రూపంలో దోపిడీ జరుగుతోంది. బయటి పార్కింగ్ ప్రదేశాల్లో రోజంతా బైక్ ఉంచితే రూ.60, కారుకు రూ.100 తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మాత్రం ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. అసలీ పార్కింగ్ ఫీజు చెల్లించేంత డబ్బు చేతిలో లేకపోవడంతో... వాహనాల్ని వదిలివెళ్లిపోయే దుస్థితి తలెత్తుతోంది.

ప్రయాణికులతోపాటూ... చాలా మంది టూరిస్టులు... వీకెండ్‌లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తమ బండ్లను పార్క్ చేసి... రైళ్లలో చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. వాళ్లకు... పర్యాటక ప్రదేశాలకు అయ్యే ఖర్చుల కంటే... పార్కింగ్ ఖర్చులే ఎక్కువ అవుతుండటం విచారకరం. ఉదాహరణకు... రామయ్య అనే ప్రయాణికుడు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బైక్ పార్క్ చేసి... వరంగల్ వెళ్లాడు. రాత్రి పది తర్వాత సికింద్రాబాద్ స్టేషన్‌కి వచ్చాడు. అతని నుంచీ పార్కింగ్ ఫీజు కింద రూ.319 వసూలు చేశారు. దీనిపై అతను తీవ్రస్థాయిలో మండిపడగా... తాము రూల్స్ ప్రకారమే పార్కింగ్‌ ఫీజు తీసుకుంటున్నామని రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ పద్మజ తెలిపారు. ప్రయాణికులు మాత్రం ఇవేం ఫీజులురా బాబోయ్ అని భయపడుతన్నారు.

First published: August 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>